తెలంగాణ

అద్భుతం... ఆశ్చర్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తమ ఉహలకు అందనంత గొప్పగా యాదాద్రి పునర్నిర్మాణం జరగడం తమ పూర్వజన్మ సుకృతం అని ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన బాధితులు ముఖ్యమంత్రి సమక్షంలో సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. యాదాద్రి పునర్నిర్మాణం సందర్భంగా అక్కడ ఇళ్లు కోల్పోయిన 60 మంది, దుకాణాలు కోల్పోయిన 119 మంది బాధితులతో కలిసి ముఖ్యమంత్రి తన అధికారిక నివాసంలో శుక్రవారం భోజనం చేశారు. ఈ సందర్భంగా యాదాద్రి పునర్నిర్మాణంపై ప్రభుత్వం రూపొందించిన వీడియోను బాధితులకు చూపించారు. యాదాద్రి ఈ విధంగా అభివృద్ధి జరుగుతుందంటే అంతకుమించిన ఆనందం మరొకటి లేదని వారు ముఖ్యమంత్రికి వివరించారు. యాదగిరిగుట్టను పూర్తిస్థాయిలో నూతనావిష్కరణ చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పునరుద్ఘాటించారు. యాదాద్రి అభివృద్ధిలో రవాణా వ్యవస్థను పటిష్ట పర్చడం, అనువైన నివాస సముదాయాలు, వ్యాపార కేంద్రాలు నిర్మించడం, పరిసర ప్రాంతాలను సుందరీకరించి ఆహ్లాదకర వాతావరణాన్ని నెలకొల్పడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. యాదాద్రిని ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య, వ్యాపార కేంద్రంగా చూడాలన్నదే తమ ధ్యేయమన్నారు. తెలంగాణలోని పది జిల్లాల నుంచి నేరుగా యాదాద్రికి చేరుకునేందుకు విశాలమైన రహదారుల నిర్మాణం ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. గిరి ప్రదర్శన కోసం గుట్ట చుట్టూ ఉన్న రోడ్లను వెడల్పు చేయాలన్నారు. దీంట్లో ఇళ్లు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయం చూపడమే కాకుండా వారికి నిర్మాణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. యాదాద్రి గుట్టపైకి వెళ్లడానికి, దిగడానికి వేర్వేరుగా రహదారులు ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దేవాలయ భూములను అక్రమించుకున్న వారి నుంచి స్వాధీనం చేసుకోవడంతో పాటు మానవతా దృక్పథంతో వారికి ప్రత్యామ్నాయాన్ని చూపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గుట్ట మీద దుకాణాలను ఇతరులకు కేటాయించబోమని, వాటికి టెండర్లు కూడా పిలిచేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన టెంపుల్ సిటీలో ఏర్పాటు చేయబోయే వ్యాపార నిర్వహణలో స్థానికులకే అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ సమీక్షలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, భువనగిరి ఎంపి బూర నర్సయ్య గౌడ్, ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత, భువనగిరి ఎమ్మెల్యే పైలా శేఖర్‌రెడ్డి, యాదగిరిగుట్ట అభివృద్ధి మండలి చైర్మన్ కిషన్‌రావు, ఆలయ ఈవో గీతా, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.