తెలంగాణ

పిఎఫ్ వివరాలు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: తెలంగాణ రాష్ట్రంలోని వేర్వేరు సంస్థల యజమానులు తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు సంబంధించిన పిఎఫ్ వివరాలు 2009 ఏప్రిల్ 1 నుండి 2016 డిసెంబర్ 31 వరకు తమకు అందించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పిఎఫ్ జాబితాలో చేరని ఉద్యోగుల వివరాలు కూడా ఇవ్వాలని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్‌ఓ) హైదరాబాద్ రీజనల్ పిఎఫ్ కమిషనర్ ఎంఎస్‌కెవివి సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని సంస్థలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పిఎఫ్ ఖాతాల్లో ఉద్యోగుల పేర్లను నమోదు చేసేందుకు ఇపిఎఫ్‌ఓ భారీ కార్యక్రమం చేపట్టింది.
ఉద్యోగులందరినీ పిఎఫ్ పరిధిలోకి తేవాలన్నదే ఈ కార్యక్రమం ప్రధానోద్దేశమని వెల్లడించారు. 2017 జనవరి 1 నుండి మార్చి 31 మధ్య కాలంలో ఉద్యోగుల వివరాలను తమకు అందచేయాలని ఆయన ఆదేశించారు. అంటే యాజమాన్యాలకు మూడు నెలల గడువు ఇచ్చారు. ఉద్యోగుల నుండి పిఎఫ్ సేకరించకపోతే ఇప్పుడు జమచేయాల్సిన అవసరం లేదన్నారు. పీనల్ డ్యామేజ్‌కు సంబంధించి నిధులు మాత్రమే జమచేయాలని సూచించారు. డిక్లరేషన్ సందర్భంగా పరిపాలనాపరమైన చార్జీలు ఏవీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. యజమానులు ఆన్‌లైన్‌ద్వారా వివరాలు పంపిస్తే, యాజమాన్యం చెల్లించాల్సిన పిఎఫ్ భాగం మొత్తాన్నా వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించారు. ప్రధానమంత్రి రోజ్‌గార్ ప్రోత్సాహన్ యోజన (పిఎంఆర్‌పివై) కింద ఏవైనా సంస్థలు తమవద్ద కొత్తగా చేరిన ఉద్యోగులకు సంబంధించిన 8.33 భాగాన్ని చెల్లించాల్సిన అవసరం లేదని, ఈ మొత్తాన్న ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని యాజమాన్యాలు సద్వినియోగం చేసుకోవాలని సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.