తెలంగాణ

నేటి నుంచి మినీ మేడారం జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫివ్రబరి 7: భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో బుధవారం నుంచి నాలుగు రోజులపాటు జరిగే మినీ మేడారం జాతరకు జిల్లా యంత్రాంగం ఏర్పా ట్లు పూర్తిచేసింది. మండ మెలిగె పండుగ పేరిట గిరిజనులు వన దేవతలైన సమ్మక్క-సారలమ్మలను నాలుగు రోజులపాటు కొలిచే ఈ జాతరకు గత కొంతకాలంగా సాధారణ భక్తులు కూడా భారీ సంఖ్యలో హాజరవుతుండటంతో మినీ జాతరగా మారిపోయింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం మహాజాతర తరువాత మరుసటి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి రోజున మండ మెలిగే పండగ నిర్వహించడం ఆనవాయితీ. మండ మెలిగే పండగ సందర్బంగా మేడారంలోని సమ్మక్క గుడి, కనె్నపల్లిలోని సారలమ్మ గుడిలతో పాటు గోవిందరాజులు, పగిడిద్ద రాజు ఆలయాలను వడ్డె పూజారులు శుద్ధి చేసి వనదేవతలకు పూజలు నిర్వహిస్తారు. మొదటిరోజు బుధవారం వనదేవతల ఆలయాలను శుద్ధిచేసి, పసుపుకుంకుమలతో ముగ్గులు వేసి అందంగా అలంకరిస్తారు. గ్రామరక్షణ కోసం మేడారం గ్రామానికి ఇరువైపులా ద్వార బంధాలు ఏర్పాటుచేసి రక్షాతోరణాలు కడతారు. బుధవారం రాత్రి మేడారం గద్దెల ప్రాంగణంలో సమ్మక్క, సారలమ్మల వడ్డె పూజారులు కుటుంబ సభ్యులతో వనదేవతలకు పూజలు చేస్తూ జాగారం చేస్తారు. మినీ మేడారం జాతరకు గడచిన రెండు రోజుల ముందు నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాక మొదలయింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు మినీ మేడారం జాతరకు హాజరయ్యేందుకు ఆర్టీసి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. వరంగల్, హన్మకొండల నుంచి మేడారానికి ప్రతి 15నిముషాలకు ఒక బస్సు నడిపేలా చర్యలు తీసుకున్నామని ఆర్టీసీ అధికారు తెలిపారు. హైద్రాబాద్ నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఈ బస్సులలో ఆన్‌లైన్ టికెట్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. మినీ మేడారం జాతరను పురస్కరించుకుని భూపాలపల్లి జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసింది. డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ఎఆర్, ఎపిఎస్పీ విభాగాలు కలిపి సుమారు 700మంది పోలీసు అధికారులను, సిబ్బందిని జాతర బందోబస్తు విధుల కోసం నియమించారు. జాతర ప్రాంతంలో ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు పికెట్లు ఏర్పాటు చేసారు. భక్తుల కోసం జిల్లా యంత్రాంగం మంచినీరు, స్నానఘట్టాలు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసింది. జాతరకు తరలివచ్చే భక్తులకు సత్వరంగా అమ్మవార్ల దర్శనం కలిగేలా బారికేడ్లు ఏర్పాటు చేసారు. జాతరకు వచ్చే భక్తులు సమర్పించే మొక్కుల కోసం దేవాదాయశాఖ అధికారులు ఇప్పటికే గద్దెల వద్ద, సమీప ప్రాంతాల్లో హుండీలను దేవాదాయ అధికారులు ఏర్పాటు చేశారు.