తెలంగాణ

పెండింగ్ గోదాములు వచ్చేనెలలో పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద గోదాముల పూర్తికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావసిన గ్రాంట్ 132 కోట్ల రూపాయల కోసం కృషి చేయాలని మార్కెటింగ్ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో గురువారం సమీక్ష జరిపారు. కేంద్రం కెవివై పథకం కింద 264 కోట్ల రూపాయల గ్రాంటు ఇచ్చిందని, వీటిలో 132 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అందాయి, పూర్తయిన గోదాముల యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లు పంపించి మిగతా నిధుల కోసం ప్రయత్నించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన 330 గోదాముల్లో 200 గోదాములు పూర్తయ్యాయని, మిగిలిన 130 గోదాములను మార్చి నాటికి పూర్తి చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. ఎనిమిది చోట్ల భూ వివాదాల వల్ల గోదాముల నిర్మాణానికి ఇబ్బందులు తలెత్తినందున ఆ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ స్థలాల్లో వాటిని నిర్మించేందుకు అనుమతించారు.
రబీ సీజన్‌లో ఈసారి దిగుబడులు అనూహ్యంగా పెరగనున్నట్టు అంచనాలు ఉన్నందున ఈ మేరకు మార్కెట్ యార్డులలో ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మార్కెటింగ్, వ్యవసాయ, ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పారు. రబీలో కనీసం 28నుంచి 30లక్షల మెట్రిక్ టన్నుల వరకు పంట దిగుబడి రావచ్చునని మంత్రి తెలిపారు. కందులు, శనగలు, వేరుశనగలు, పత్తి, మిర్చి, ఉల్లికి ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న ధరలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి సమీక్షించారు.కనీసం మద్దతు ధర తప్పనిసరిగా వచ్చేట్టు చూడాలని చెప్పారు. పొరుగు రాష్ట్రాల్లో ధరల స్థితిగతులను నిరంతరం మానిటరింగ్ చేయాలని చెప్పారు. ధరల స్థిరీకరణపై పకడ్బందీ చర్యలు తీసుకోవాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర కొత్త మార్కెట్ చట్టం ఈ బడ్జెట్ సమావేశాల్లోనే తీసుకు రానున్నట్టు చెప్పారు.
సిఎంకు బిసి బడ్జెట్ నివేదిక
ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును గురువారం కలిసి బిసి బడ్జెట్‌పై నివేదిక అందజేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను అమలు చేస్తున్న తరహాలో బిసి సబ్ ప్లాన్ అమలు చేయాలని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. బిసి ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. బిసి బడ్జెట్ ఏ విధంగా రూపకల్పన చేయాలనే ఆంశంపై ఆర్థిక మంత్రి ఒక నివేదిక రూపొందించి ముఖ్యమంత్రికి అందజేశారు.