తెలంగాణ

డిఎస్సీ 2008 టీచర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: 2008 డిఎస్సీలో నియమితులైన వారందరి సర్వీసులను క్రమబద్ధీకరించాల్సిందేనని రాష్ట్ర హైకోర్టు శుక్రవారం అభిప్రాయపడింది. జస్టిస్ పివి సంజీవకుమార్, జస్టిస్ ఎన్ బాలయోగిలతో కూడిన డివిజన్ బెంచ్ మూడు పిటిషన్ల విచారణను ముగిస్తూ, ఈ తీర్పును ఇచ్చారు. డిఇడి అభ్యర్థులకు 30 శాతం పోస్టులను కేటాయించడాన్ని అభ్యర్థులు సవాలు చేశారు. ఎపి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నిబంధనల్లో రూల్-7 చేర్చడంపై కోర్టు స్టే ఇవ్వగా, దానిపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాలు చేసింది. సుప్రీంకోర్టు సైతం హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తూ, పిటిషన్ విచారణను త్వరగా ముగించాలని సూచించింది. ఆ ఆదేశాల మేరకు హైకో ర్టు ఆ పిటిషన్లను పునర్విచారించి తాజా ఆదేశాలను ఇచ్చింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం సైతం 30 శాతం కోటా నిబంధనను అమలు చేయలేదని న్యాయస్థానం గుర్తించింది. రిట్ పిటిషనర్లు లేవనెత్తిన అంశాలు అన్నీ విద్యాత్మకమైనవేనని, మిగిలిన అంశాలు పరిష్కారమైనందున, పిటిషన్లను కొట్టి వేస్తున్నట్టు బెంచి పేర్కొంది.