రాష్ట్రీయం

భద్రాద్రిలో ముగిసిన రామాయణ మహాక్రతువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మార్చి 19: ఖమ్మం జిల్లా శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో గత నెల 18వ తేదీన ప్రారంభమైన 100 ఏళ్ల తర్వాత నిర్వహించే శ్రీరామాయణ మహాక్రతువు శనివారం మహాపూర్ణాహుతితో ముగిసింది. ఈ ఉత్సవంలో శ్రీశ్రీశ్రీ అహోబిల జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ దేవనాథ రామానుజ జీయర్‌స్వామి పాల్గొన్నారు. స్తపతులు ఉత్సవమూర్తులకు స్వర్ణ కవచం తొడిగి అప్పగించాక వారికి సన్మానం చేశారు. అనంతరం సువర్ణశోభిత ఉత్సవమూర్తులకు గర్భాలయంలో ప్రాణప్రతిష్ట చేశారు. మహాకుంభ ప్రోక్షణ చేశారు. అభిషేకం, తొలి ఆరాధన చేసి నివేదన ఇచ్చాక 25 మంది రుత్విక్కుల సమక్షంలో, మేళతాళాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య చిత్రకూట మండపానికి నూతన స్వర్ణకవచాలంకరణ ఉత్సవమూర్తులను తీసుకొచ్చి గంగ, యమున, సరస్వతి, కృష్ణా, శబరి, గోదావరి, తుంగభద్ర, పాతాళగంగ తదితర నదీజలాలతో సంప్రోక్షణ, అభిషేకం నిర్వహించారు. అనంతరం శాంతి కల్యాణం నిర్వహించి రామదాసు దివ్యాభరణాలు, బంగారు గొడుగు, బంగారు పాదుకలు, వెండి రాజదండం, బంగారు రాజముద్రిక, సామ్రాట్ కిరీటం, చింతాకు పతకం, పచ్చల పతకం, 3 మంగళసూత్రాల ఆభరణాలు ధరింప చేసి మహాచక్రవర్తి శ్రీరామచంద్రమూర్తికి కత్తి, డాలు, బరిసె, ధనుర్భాణాలు అలంకరించారు.