తెలంగాణ

బడ్జెట్ వ్యయం పెరుగుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో ఉమ్మడి రాష్ట్రంలో అత్యల్పంగా 67 శాతం, అత్యధికంగా 88 శాతం నిధులు వ్యయం చేశారు. కేటాయించిన నిధులన్నీ ఖర్చు చేయడం ఇప్పటి వరకు జరగలేదు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శనివారం బడ్జెట్‌పై సమాధానం చెబుతూ శాసన సభలో తెలిపారు. 2004 నుంచి ఇప్పటి వరకు బడ్జెట్ ఎంత శాతం వ్యయం చేశారో ఈటల వివరించారు. 2004-5 సంవత్సరంలో 82శాతం, 5-6 సంవత్సరంలో 83శాతం, 2006-07లో 86శాతం, 2007-08లో 88శాతం, 2008-09లో 67శాతం, 2009-10లో 77శాతం, 2010-11లో 84శాతం, 2013-14లో 71శాతం వ్యయం చేశారని తెలిపారు. పదేళ్ల కాలంలో అత్యల్పంగా 67శాతం, అత్యధికంగా 88శాతం వ్యయం చేసినట్టు చెప్పారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత 2015-16లో 86.5శాతం వ్యయం చేసినట్టు చెప్పారు. బడ్జెట్‌లో కేటాయించిన విధంగా వంద శాతం ఏ సంవత్సరంలోనూ వ్యయం చేయలేదని ఈటల తెలిపారు.