తెలంగాణ

అసత్యాల బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:బడ్జెట్‌లో అంశాలన్నీ అసత్యాలే అని, ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉన్నాయని కాంగ్రెస్ శాసన సభాపక్షం ఉప నాయకుడు భట్టి విక్రమార్క విమర్శించారు. బడ్జెట్ అంచనాలు, లెక్కలు వాస్తవానికి దగ్గరగా లేవని అన్నారు. బడ్జెటేతర వ్యయం అంటూ కొత్త పదాన్ని సృష్టించారని అన్నారు. డబుల్ బెడ్‌రూమ్, మిషన్ భగీరథ వంటి పథకాల గురించి ఎన్నికల ముందు ప్రకటించారనీ, బడ్జెట్‌లో వీటికి ఎలాంటి కేటాయింపులు చేయకుండా రుణాలు తీసుకుంటామని చెబుతున్నారని అన్నారు. ఒకేసారి రుణమాఫీ చేసి ఉంటే రైతులకు ప్రయోజనం కలిగి ఉండేదని, ప్రభుత్వ వైఖరి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. బ్యాంకులు అప్పులు ఇవ్వకపోవడంతో ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పు తీసుకున్నారని, రెండు శాతం, మూడు శాతం వడ్డీకి తీసుకోవడం వల్ల రైతులపై భారం పడిందని అన్నారు. చెరువుల పూడిక తీసివేతను మిషన్ కాకతీయ పేరుతో చేపడుతున్నారని, మంచి కార్యక్రమమన్నారు. ఇంటింటికి నీటి సరఫరా కోసం లక్ష కిలోమీటర్ల పైప్‌లైన్ వేయడం కన్నా పూడిక తీసిన చెరువుల నుంచి ఇంటింటికి మంచినీటిని సరఫరా చేయవచ్చునని సూచించారు. మైనారిటీలకు, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. కేజీ నుంచి పీజి వరకు ఉచిత విద్య ఊసే ఎత్తడం లేదని విమర్శించారు.
గిరిజన విశ్వవిద్యాలయం గురించి ప్రభుత్వం మాట్లాడడంలేదని, జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. మైనారిటీల రిజర్వేషన్లు ఏమయ్యాయి అని ప్రశ్నించారు.