తెలంగాణ

వైభవంగా లక్ష్మీనరసింహుడి చక్రతీర్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నంధీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యుల ఆధ్వర్యంలోని అర్చక బృందం ఉదయం 11గంటలకు యాగశాలలో మహాపూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం లక్ష్మీనరసింహుడి చక్రతీర్థ స్నాన ఘట్టాన్ని వేలాది మంది భక్తుల మధ్య ఘనంగా నిర్వహించారు. స్వామివారిని పల్లకి సేవతో తీరువీధుల గుండా భారీ ఊరేగింపుతో పుష్కరిణికి తీసుకెళ్లి చక్రతీర్థం స్నానాది ఘట్టాలు నిర్వహించారు. దారి పొడవునా ఊరేగింపులో పాల్గొన్న భక్తులు, పుష్కరణిలో చక్రతీర్థంలో పాల్గొని గోవింద నామస్మరణలతో భక్తి పారవశ్యంతో పులకించారు. రాత్రి స్వామి వారి పుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలను భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఆయా ఉత్సవ కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు దంపతులు, ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. యాదాద్రి బ్రహ్మోత్సవాల పర్వం చివరి రోజైన ఆదివారం ఉదయం 10 గంటలకు స్వామివారి అష్టోత్తర శతఘాటాభిషేకం నిర్వహిస్తారు. రాత్రి 10గంటలకు శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.

యాదాద్రి పుష్కరణిలో లక్ష్మీనరసింహుడి చక్రతీర్థ స్నానంలో వేలాదిగా పాల్గొన్న భక్తజనం

ముగిసిన రామాయణ మహాక్రతువు

భద్రాచలం, మార్చి 19: ఖమ్మం జిల్లా శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో గత నెల 18వ తేదీన ప్రారంభమైన 100 ఏళ్ల తర్వాత నిర్వహించే శ్రీరామాయణ మహాక్రతువు శనివారం మహాపూర్ణాహుతితో ముగిసింది. ఈ ఉత్సవంలో శ్రీశ్రీశ్రీ అహోబిల జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ దేవనాథ రామానుజ జీయర్‌స్వామి పాల్గొన్నారు. స్తపతులు ఉత్సవమూర్తులకు స్వర్ణ కవచం తొడిగి అప్పగించాక వారికి సన్మా నం చేశారు. అనంతరం సువర్ణశోభిత ఉత్సవమూర్తులకు గర్భాలయంలో ప్రాణప్రతిష్ట చేశారు. మహాకుంభ ప్రోక్షణ చేశారు. అభిషేకం, తొలి ఆరాధన చేసి నివేదన ఇచ్చాక 25 మంది రుత్విక్కుల సమక్షంలో, మేళతాళాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య చిత్రకూట మండపానికి నూతన స్వర్ణకవచాలంకరణ ఉత్సవమూర్తులను తీసుకొచ్చి గంగ, యమున, సరస్వతి, కృష్ణా, శబరి, గోదావరి, తుంగభద్ర, పాతాళగంగ తదితర నదీజలాలతో సంప్రోక్షణ, అభిషేకం నిర్వహించారు. అనంతరం శాంతి కల్యాణం నిర్వహించి రామదాసు దివ్యాభరణాలు, బంగారు గొడుగు, బంగారు పాదుకలు, వెండి రాజదండం, బంగారు రాజముద్రిక, సామ్రాట్ కిరీటం, చింతాకు పతకం, పచ్చల పతకం, 3 మంగళసూత్రాల ఆభరణాలు ధరింప చేసి మహాచక్రవర్తి శ్రీరామచంద్రమూర్తికి కత్తి, డాలు, బరిసె, ధనుర్భాణాలు అలంకరించారు. అనంతరం రాజవీధి గుండా సార్వభౌమ సేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు.

శ్రీరామ మహా పట్ట్భాషేకం నిర్వహిస్తున్న దృశ్యం