తెలంగాణ

తెరాస బలం 68శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: పార్టీ బలాన్ని ప్రత్యర్థుల బలాన్ని అంచనా వేసేందుకు వివిధ సంస్థలతో తరచుగా సర్వేలు నిర్వహించే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇటీవల నిర్వహించిన సర్వేలో తెలంగాణ లో 68 శాతం మంది ఓటర్లు టిఆర్‌ఎస్‌కు మద్దతు పలికినట్టు తేలింది. ఈ విషయాన్ని అంతర్గత సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సన్నిహితులకు వివరించారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ భారీ విజయం సాధించబోతున్నట్టు సర్వే సంస్థలు ముఖ్యమంత్రికి నివేదిక ఇస్తే పార్టీ శ్రేణులు సైతం అంత భారీ మెజారిటీని ఊహించలేదు. కానీ కెటిఆర్ మాత్రం సర్వే ఆధారంగా ప్రచారం ప్రారంభం నుంచి వంద సీట్లలో విజయం సాధిస్తామని చెబుతూ వచ్చారు. మెజారిటీ సాధించకపోతే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ఇదే విధంగా 70శాతం వరకు ఓట్లు టిఆర్‌ఎస్‌కు లభించనున్నాయని సర్వే సంస్థలు తేల్చిన విషయాన్ని కెసిఆర్ నోటిఫికేషన్ కన్నా ముందే చెప్పారు. తీరా ప్రత్యర్థులు ఎవరికీ డిపాజిట్ దక్కకుండా రికార్డు స్థాయిలో విజయం సాధించారు. నారాయణఖేడ్, పాలేరు ఉప ఎన్నికల్లో సైతం ఇదే విధంగా సర్వే నిర్వహించారు. సర్వేలో చెప్పినట్టుగానే ఫలితాలు వచ్చాయి. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచిపోయింది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువు ఉన్న సమయంలో కెసిఆర్ ఇటీవల ఒక సంస్థతో సర్వే చేయించారు. 68 శాతం ప్రజలు టిఆర్‌ఎస్ వైపు ఉన్నట్టు తేలింది. సుదూరంలో కాంగ్రెస్‌కు అధికారం దక్కే సూచనలు కనిపించడం లేదని, దీంతో నిరాశా నిస్పృహలతో కాంగ్రెస్ ఎలాగైనా ప్రాజెక్టులను ఆపాలని కేసులు వేయిస్తోందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసులు ఎన్ని వేసినా, నాయకులు ఏం మాట్లాడినా అంతిమంగా ప్రభుత్వం ఏం చేస్తుందో గ్రామంలో ఇంటి ముందు కనిపిస్తుందని, ప్రజలు కంటి ముందు కనిపించే నిజాన్ని నమ్ముతారు కానీ ప్రచారాన్ని కాదని ముఖ్యమంత్రి నాయకులకు వివరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచేందుకు ఏం చేస్తే బాగుటుందో ఆలోచిస్తున్నామని, వీటిని అమలు చేసిన తరువాత అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందని సిఎం నాయకులకు తెలిపారు.
ఇంకా రెండేళ్ల కాలం ఉన్న సమయంలోనే 68 శాతం ప్రజలు టిఆర్‌ఎస్ పట్ల మొగ్గు చూపారని, ఈ బలం ఇంకా పెరుగుతుందనే ధీమాలో ముఖ్యమంత్రి ఉన్నారు. అధికారం లేదు, వచ్చే సూచనలు కనుచూపు మేరలో కనిపించడం లేదనే నిరాశలో కొందరు ఎలాంటి రాజకీయాలకైనా పాల్పడతారు, వీటి ఫలితం ఎన్నికల్లోనూ తేలుతుంది అని ముఖ్యమంత్రి అన్నారు.
రెండేళ్ల తరువాత పంచాయతీ ఎన్నికలు, సాధారణ ఎన్నికలు తప్ప ఇప్పట్లో ఎన్నికలు లేవు. మిగిలిన రెండేళ్లలో ప్రధానమైన అంశాలపై దృష్టి సారించనున్నారు. కేసుల వల్ల ప్రాజెక్టులకు కొందరు అడ్డంకులు కల్పించినా, అవి తాత్కాలికమేనని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేసి చూపిస్తామని, ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఆ ప్రాంతంలో ప్రత్యర్థులు కనీసం డిపాజిట్లను ఆశించగలరా? అని కెసిఆర్ ధీమాగా సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. ఈ సంగతి తెలుసు కాబట్టే కాళేశ్వరంకు అనుమతులు లేవు అని కేసులు వేస్తున్నారని, తెలంగాణ ప్రాజెక్టులపై తెలంగాణ వాళ్లు కేసు వేయవచ్చా? అని కెసిఆర్ నాయకుల ముందు ప్రశ్నించారు.
2014లో ఉమ్మడి రాష్ట్రంలోనే సాధారణ ఎన్నికలు జరిగాయని, అప్పుడున్న అనిశ్చిత పరిస్థితుల్లో టిఆర్‌ఎస్‌పై ఎన్నో అపోహలని, రెండున్నర ఏళ్ల పాలనా కాలంలో అవన్నీ అపోహలే అని తేలిపోయాయని, 2014 కన్నా ఎక్కువ స్థాయిలో టిఆర్‌ఎస్ పట్ల జనం ఆదరణ చూపిస్తారని సన్నిహితుల వద్ద కెసిఆర్ వ్యాఖ్యానించారు. మారిన పరిస్థితుల వల్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారని ముఖ్యమంత్రి వారికి తెలిపారు.