తెలంగాణ

రూ.1400ల కోట్లతో 70 మైనారిటీ గురుకుల పాఠశాలల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్: మైనారిటీల సంక్షేమానికి టిఆర్‌ఎస్ సర్కార్ పెద్దపీట వేస్తుండగా, ఠూ.1400కోట్లతో 70 మైనారిటీ గురుకుల పాఠశాలల ఏర్పాటుకు సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టినట్లు మైనారిటీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, మైనారిటీ కళాశాలల సెక్రెటరీ షఫియుల్లా స్పష్టం చేశారు. శనివారం మెదక్ జిల్లా గజ్వేల్ పట్టణ శివారులో మైనారిటీ గురుకుల పాఠశాల నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మైనారిటీ గురుకుల పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేయనుండగా, ఉర్దూ, తెలుగు సబ్జెక్టులు కూడా ఉండనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి మైనారిటీ గురుకుల పాఠశాలలు ప్రారంభం కానుండగా, 6, 7, 8 తరగతుల విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రతి తరగతిలో 80మంది విద్యార్థులకు అవకాశం కల్పించనుండగా, 2 సెక్షన్లుగా విభజించి విద్యాభోధన చేయనున్నట్లు చెప్పారు. కాగా ప్రతి పాఠశాలలో 240మంది విద్యార్థులకు సరిపడా పాఠశాల గదులు, వౌలిక వసతులు గురుకుల తరహాలో కల్పిస్తుండగా, అవసరమయ్యే పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు రాసి పంపించినట్లు తెలిపారు. ప్రతి గురుకుల పాఠశాలకు రూ.20కోట్లు వెచ్చిస్తుండగా, 5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల సదుపాయాలతో భవన నిర్మాణాలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

‘షాదీ ముబారక్’
గోల్‌మాల్‌పై ఏసిబి కన్ను

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాల నిధుల గోల్‌మాల్‌పై అవినీతి నిరోధక శాఖ దృష్టి సారించి, రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అదేవిధంగా గురువారం హైదరాబాద్‌లోని హజ్‌హౌస్‌లో ఫైళ్లను పరిశీలించారు. షాదీ ముబారక్ పథకానికి 2015-16లో వచ్చిన దరఖాస్తులు, లబ్ధిదారులు, పెండింగ్‌లోవున్న దరఖాస్తులకు సంబంధించి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. కొన్ని ఫైళ్లను తమ వెంట తీసుకెళ్లారు. పథకం ప్రారంభానికి ముందు వివాహం చేసుకున్న వారు, ఒకటి కంటే ఎక్కువ మార్లు పథకం ద్వారా లబ్ధి పొందిన వారు ఎక్కువగా ఉన్నారని, కొందరు అధికారులు నిధుల విడుదలలో రాజకీయ నాయకులకు సహకరిస్తున్నారనే సమాచారం అందడంతో తాము రంగంలోకి దిగామని ఎసిబి అధికారులు తెలిపారు. శుక్రవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లోని మైనార్టీ సంక్షేమ శాఖలోనూ ఏసిబి తనిఖీలు నిర్వహించింది.