తెలంగాణ

‘ఎయిమ్స్’పై మండలిలో రగడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రి వ్యవహారంపై శనివారం శాసన మండలి సమావేశంలో దుమారం రేగింది. చైర్మన్ స్వామిగౌడ్ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభలో బడ్జెట్‌పై సాధారణ చర్చ జరిపేందుకు అనుమతించారు. దీంతో ప్రతిపక్ష సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి బడ్జెట్‌పై తన అభిప్రాయాన్ని తెలిజేస్తూనే, కాంగ్రెస్ హయంలో బీబీనగర్‌లో నిర్మించిన ఎయిమ్స్‌కు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవటాన్ని తప్పుబట్టారు. దీంతో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి జోక్యం చేసుకుని, కాంగ్రెస్ పాలన కుంభకోణాల మయమని, ఈ ఆసుపత్రి నిర్మాణంలో అవకవతలు జరిగాయన్న ఆరోపణపై ఇంకా విచారణ జరుగుతుండటం వల్లే నాడు కాంగ్రెస్ దీనిని ప్రారంభించలేకపోయిందని ఎదురు తిరిగారు. కాంగ్రెస్ పార్టీ కారణంగానే తెలంగాణ సర్వనాశనమైందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వందల కోట్లు వెచ్చించి ఈ ఆసుపత్రిని నిర్మించగా, తెరాస ప్రభుత్వం కేవలం రూ.10 కోట్లు వెచ్చించి సేవలను అందుబాటులోకి తెచ్చి గొప్పగా ప్రచారం చేసుకోవటం విడ్డూరంగా రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వెంటనే ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు జోక్యం చేసుకుని మంత్రి మధ్యలో కలగచేసుకోవటంపై అభ్యతరాన్ని వ్యక్తం చేయగా, తెరాస సభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్, పాతూరి సుధాకర్‌రెడ్డి కూడా జోక్యం చేసుకోవటంతో సభలో కాసేపు వాద, ప్రతివాదనలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడేళ్ల క్రితమే పూర్తిచేసిన ఎయిమ్స్‌కు తెరాస ప్రభుత్వం నిధులు కేటాయించలేదని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. మంత్రి నాయిని జోక్యం చేసుకుని భవన నిర్మాణంలో కుంభకోణం జరిగిందని, దానిపై విచారణలు జరుగుతున్నందునే కాంగ్రెస్ ఎయిమ్స్‌ను ప్రారంభించలేకపోయిందన్న విషయాన్ని సభ్యులు అంగీకరించాలే తప్ప, సభను తప్పుదోపట్టించరాదని సూచించారు. అనంతరం కాంగ్రెస్ సభ్యుడు రంగారెడ్డి మాట్లాడుతూ, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రభుత్వం ఎందుకు పక్కనపెట్టిందని, రీ డిజైనింగ్ అవసరమేంటని ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాడిన ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిగానే ఎంతో సంతోషించానని వ్యాఖ్యానించిన రంగారెడ్డి, బడ్జెట్ మాత్రం ఆయన ఆలోచనా విధానానికి వ్యితిరేకంగా ఉందని, ఇందులో పేదలకు తగిన కేటాయింపులు చేయలేదని విమర్శించారు.