తెలంగాణ

వీరంగం సృష్టించిన ఎస్‌ఐల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఫిబ్రవరి 17: జిల్లాలోని దురాజ్‌పల్లి శ్రీలింగమంతులస్వామి జాతర సందర్భంగా ఈనెల 14న అతిగా మద్యం సేవించి బహిరంగ ప్రదేశంలో పెన్‌పహాడ్ ఎస్‌ఐతో పాటు మరో కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించిన హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఎస్‌ఐలుగా పనిచేస్తున్న దరావత్ విజయ్, తోట మహేష్‌లను సస్పెండ్ చేస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌భగవత్ ఆదేశాలు జారీచేశారు. ఈనెల 14న అతిగా మద్యం సేవించిన వీరు బహిరంగ ప్రదేశంలో నృత్యాలు చేస్తూ సమీపంలో ఉన్నవారి పట్ల తప్పుగా ప్రవర్తిస్తుండడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్న పెన్‌పహాడ్ ఎస్‌ఐ మల్లేష్‌తో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా సంఘటను వీడియో తీస్తున్న కానిస్టేబుల్ సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేశారు. ఈ విషయమై చివ్వెంల పోలీస్‌స్టేషన్‌లో వీరివురిపై క్రిమినల్ కేసు నమోదుచేశారు. సంఘటనపై జిల్లా ఎస్పి పరిమళ హనానూతన్ రాచకొండ కమిషనర్‌కు నివేధిక పంపించారు. దీంతో కమిషనర్ వీరివురిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. అలాగే రాచకొండ కమిషనరేట్ పరిధిలోని భువనగిరిలో ఓ కేసు విషయంలో లోక్ అదాలత్‌లో కేసు రాజీచేసేందుకు కక్షిదారుల నుండి డబ్బులు డిమాండ్‌చేసిన కానిస్టేబుళ్లు డి.శ్రీరాం(పిసి నెంబర్ 3242), ఎం. అశోక్(పిసి నెంబర్ 3223)లను సస్పెండ్ చేస్తూ రాచకొండ కమిషనర్ మహేష్‌భగవత్ ఉత్తర్వులు జారీచేశారు. ఏ స్థాయిలో ఉన్న అధికారులైన అవినీతికి పాల్పడిన, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన, తప్పుగా ప్రవర్తించిన కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ మహేష్ భగవత్ హెచ్చరించారు.