తెలంగాణ

కోదండరాంపై చెరుకు, యెన్నం ధ్వజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌కు పైత్యం ఎక్కువైందని, జెఎసి కాస్త కెఎసి (కోదండరామ్ యాక్షన్ కమిటీ)గా మారిందని తెలంగా ణ ఉద్యమ కమిటీ నేతలు మండిపడ్డారు. ఈ నెల 22న నిర్వహించాలనుకున్న నిరుద్యోగ నిరసన ర్యాలీ ప్రొఫెసర్ కోదండరామ్ బలప్రదర్శన కాదని, నిరుద్యోగుల కడుపు మంట, బాధలను తెలియజేసే నిరసన ర్యాలీ అని తెలంగాణ ఉద్యమ కమిటీ నేతలు చెరుకు సుధాకర్, మా జీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సోమవారం విలేఖరు ల సమావేశంలో అన్నారు. గద్దర్, విమలక్క వంటి ఉద్యమకారులను ప్రొఫెసర్ కోదండరామ్ కలుపుకుని పోవ డం లేదని, కేవలం తానొక్కడే నడిపిస్తున్నారని వారు విమర్శించారు. టి.జెఎసికి పండ్లు కాయడం లేదని, చెట్టు ఎండిపోయిందని, ఆచెట్టు కట్టెలు పొయ్యిలోకి కూడా పనికి రావని వారు ధ్వజమెత్తారు. తమ తెలంగాణ ఉద్య మ కమిటీ వంటి ఉద్యమ సంస్థలు, ప్రజా సంఘాలు, వామపక్షాలను కలుపుకుని పోవడం లేదని తెలిపారు.