తెలంగాణ

ర్యాలీపై ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: టిజెఎసి 22న నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన ర్యాలీపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభు త్వం- టిజెఎసి పంతాలు, పట్టింపులకు పోవడంతో 22న ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. ఇదిలావుంటే, ర్యాలీకి అనుమతిని పోలీసులు నిరాకరించారు. మరోవైపు హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. హైకోర్టు తీర్పు ఎలావున్నా ర్యాలీ నిర్వహించి తీరాలన్న పట్టుదలతో జెఏసి ఉంది. కాగా నిరుద్యోగ నిరసన ర్యాలీని ఎట్టిపరిస్థితుల్లో కొనసాగకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా వ్యూహంతో ఉంది. తెలంగాణలో ఖాళీగావున్న ప్రభుత్వోద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, పోటీ పరీక్షలకు క్యాలెండర్ ప్రకటించాలన్న ఐదు డిమాండ్లతో 22న నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహించాలని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ సంకల్పించారు. ఈమేరకు పలు జిల్లాల్లో పర్యటించి, నిరుద్యోగుల తో కోదండరామ్ భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు నిర్వహించే ర్యాలీని జయప్రదం చేసేందుకు హైదరాబాద్‌కు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ర్యాలీని బాగ్‌లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు నిర్వహించేందుకు టి.జెఎసి సన్నాహాలు చేసింది. ఈ ర్యాలీ కి అనుమతించాల్సిందిగా ప్రొఫెసర్ కోదండరామ్ ఈనెల 1న నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అయితే నగర పోలీసు కమిషనర్ ఆ వినతి పత్రాన్ని నగర సెంట్రల్ జోన్ డిసిపికి పంపించారు. సెంట్రల్ జోన్ డిసిపి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేయడంతో, తాజా గా టిజెఎసికి అనుబంధ విభాగమైన విద్యావంతుల వేదిక హైకోర్టును ఆశ్రయించింది. అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించాల్సిందిగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, మరింత పట్టింపులు పెరిగాయి. విద్యావంతుల వేదిక దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సాయంత్రం 4 గంటలలోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.
నగర శివారులో...
చివరకు పోలీసు అధికారులు నగరంలో ర్యాలీకి అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ర్యాలీకి అనుమతిస్తే సంఘ విద్రోహ శక్తులు చొరబడే అవకాశం ఉందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. పైగా 10 వేలమంది మాత్రమే నగరానికి వస్తారని చెబుతున్నప్పటికీ, 30 వేలు దాటే అవకాశం ఉందని, దీంతో నగరంలో ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతాయని, తమిళనాడులో జరిగిన జల్లికట్టు ఉద్య మం తరహాలో ఉద్యమించాలన్న సంకేతాలు తమకు ఉన్నాయని తెలిపారు. నగర శివారులో అంటే సైబరాబాద్ పరిథిలో 3 ప్రాంతాలు, రాచకొండ కమిషనరేట్ పరిథిలో 3 ప్రాంతాల్లో ఎక్కడైనా ర్యాలీ నిర్వహణకు అభ్యంతరం లేదని తెలిపారు. అయితే మంగళవారం దీనిపై కోర్టులో విచారణ కొనసాగనున్నది. కోర్టు తీర్పు ఎలా ఉంటుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు.
టిజెఎసి తర్జన భర్జన
ర్యాలీకి అనుమతివ్వలేమని కోర్టుకు పోలీ సు అధికారులు చెప్పిన నేపథ్యంలో టిజెఎసి అత్యవసరంగా సమావేశమై సమాలోచనలు జరిపింది. ముందుగా ప్రకటించిన ప్రకారం బాగ్‌లింగంపల్లి నుంచి ఇందిరాపార్కు వరకు ర్యాలీ నిర్వహించే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రకటించిన రూట్లలోనే ర్యాలీ నిర్వహించాలని కొందరు అభిప్రాయపడగా, అలాచేస్తే ఇప్పటికే ఉద్యోగాలు లేక బాధలో ఉన్న నిరుద్యోగులు పోలీసుల లాఠీల దెబ్బలకు గురై మరింత బాధ పడతారేమోనని, విధ్వంసానికి దారి తీసినా, లాఠీ దెబ్బలకు నిరుద్యోగులు గురైనా టిజెఎసికి చెడ్డ పేరు వస్తుందని, ఫలితంగా ప్రభుత్వం లాభంపొందే ప్రయత్నం చేస్తుందని, భవిష్యత్తులో టిజెఎసి పిలుపులకు నిరుద్యోగులు, ప్రజలు స్పందిస్తారో లేదోనన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి.