తెలంగాణ

మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఖరీఫ్ లోగా పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20:రాష్ట్రంలోని మధ్యతరహా నీటిపారుదల పథకాలన్నీ వచ్చే ఖరీఫ్ లోగా పూర్తి కావాలని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. అనేక కారణాలతో ఈ పథకాలు పెండింగ్‌లో ఉన్నాయని, వచ్చే ఖరీఫ్‌లోగా పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని అన్నారు. ఈ వేసవిలో కాలువల పూడిక తొలగింపు, జంగిల్ క్లియరెన్స్ తదితర కార్యక్రమాలు పూర్తి చేస్తేనే ఖరీఫ్‌లో రైతులకు సాగునీరు అందించగలమని మంత్రి చెప్పారు. రామప్ప, పాకాల, లక్నవరం, మల్లూరు వాగు తదితర పథకాలను పూర్తి స్థాయి అంచనాలను రూపొందించి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద నిధుల కోసం పపించాలని చెప్పారు. జిల్లాల వారీగా పెండింగ్ మధ్య తరహా ప్రాజెక్టుల పురోగతిని మంత్రి సమీక్షించారు. అదే విధంగా జిల్లా వారీగా మైనర్ ఇరిగేషన్ కింద ఖరీఫ్, రబీలో జరుగుతున్న అయకట్టు వివరాలను సమీక్షించారు. మిషన్ కాకతీయ 1,2 కింద పెరిగిన, అదనపు ఆయకట్టు కచ్చితంగా నమోదు చేయాలని, ఆ మేరకు తనకు నివేదికలు ఇవ్వాలని చెప్పారు. మిషన్ కాకతీయ చేపట్టక ముందు ఉన్న ఆయకట్టు వివరాలను మిషన్ కాకతీయ తరువాత పెరిగిన ఆయకట్టును పోల్చాలని మంత్రి చెప్పారు. ఇది వరకే పూర్తయిన ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద వాస్తవంగా జరగవలసిన ఆయకట్టులో గ్యాప్ ఆయకట్టును పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. చిన్నీటి వనరుల కింద పది సంవత్సరాలుగా జిల్లాలు, డివిజన్లు, చెరువుల వారిగా జరుగుతున్న ఆయకట్టు మిషన్ కాకతీయ ప్రభావంతో పెరిగిన ఆయకట్టు సంబంధించి నివేదికలు ఇవ్వాలని కోరారు. త్వరలో సింగూర్ కాల్వల వెంట క్షేత్ర స్థాయిలో పర్యటిస్తానని, అలాగే భద్రాది, కొత్తగూడెం జిల్లాలో పర్యటించి కినె్నరసాని తదితర ప్రాజెక్టుల పురోగతి పరిశీలిస్తానని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇరిగేషన్ శాఖ సెక్రటరీ వికాస్ రాజ్, ఇఎన్‌సి విజయప్రకాశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.