తెలంగాణ

మూసీ టెండర్లు మార్చి 1న ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: మూసీ ద్వారా యాదాద్రి జిల్లాల్లో 61వేల ఎకరాలకు సాగునీటిని అందించే పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునియాదిగాని పల్లి కాల్వల నిర్మాణం తొమ్మిది నెలల్లో పూర్తి చేసే విధంగా కాలువల నిర్మాణానికి మార్చి 1న టెండర్లు ఫైనల్ చేయనున్నారు. మార్చి ఒకటిన టెండర్లు ఫైనల్ అయిన తరువాత తొమ్మిది నెలల్లో పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించడం వల్ల ఆ మేరకు ప్రణాళిక రూపొందించినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. పిల్లాయిపల్లి కాలువ కింద భూదాన్ పోచంపల్లి, చౌటుప్పల్, రామన్నపేట, చిట్యాల, మునుగోడు మండలాల్లోని 32 గ్రామాలకు సాగునీరు అందతుంది. బునియాదిగాని పల్లి కింద బీబీనగర్, భువనగిరి, వలిగొండ, ఆత్మకూరు, మోత్కురు మోటకొండూరు, అడ్డగూడూరు మండలాల్లో 48 గ్రామాలలో సాగునీరు అందుతుంది. ధర్మారెడ్డి పల్లి పథకంలో వలిగొండ, రామన్నపేట, చిట్యాల, నార్కట్‌పల్లి మండలాల్లో 40 గ్రామాల రైతులకు ప్రయోజనం కలుగుతుంది. గతంలో ప్రతిపాదించిన ఆయకట్టు కన్నా నాలుగు రేట్లు ఎక్కువ ఆయకట్టు పెంచుతూ ఈ ప్రతిపాదనలు రూపొందించినట్టు అధికారులు తెలిపారు. హరిత హారంలో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాకు వచ్చినప్పుడు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ఈ మూడు కాలువల గురించి వివరించారు. గతంలో ఈ కాలువల నిర్మాణం గురించి ఆలోచన జరిగినా పనులు మాత్రం చేపట్టలేదని చెప్పారు. కాలువల నిర్మాణానికి మూడు వందల కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇనె్వస్టిగేషన్ సంస్థతో సర్వే పనులు పూర్తి చేయించి, టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునియాది గాని పల్లి కాలువలను మూసీ నదికి అనుసంధానం చేస్తారు. గతంలో కాలువల ప్రతిపాదన చేసినా భూ సేకరణ కూడా చేయలేదని అధికారులు తెలిపారు. ఈ మూడు కాలువలతో పాటు డిస్ట్రిబ్యూటరీలను సైతం చేర్చారు. ప్రధాన కాలువను మొత్తం 210 కిలో మీటర్ల పొడవున నిర్మించనున్నారు. పిల్లాయి పల్లిలో46 డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు చేస్తారు. పాత ప్లాన్‌లో 30 చెరువులు నింపాలని ప్రతిపాదించగా, ఇప్పుడు 80 చెరువులు నింపాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ధర్మారెడ్డి పల్లి కాలువలో గతంలో 15 చెరువులు నింపాలని ప్రతిపాదన కాగా, వాటిని 36కు పెంచారు. అదే విధంగా బునియాదిగాని పల్లి కాలువ కింద 57 చెరువులను నింపాలనే ప్రతిపాదన మార్చి 96 చెరువులు నింపాలని కొత్తగా ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 61వేల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రాజెక్టు పురోగతిపై సమీక్షలు జరుపుతున్నారు.