తెలంగాణ

‘బిల్ట్ కార్మికులకు న్యాయం జరిపిస్తాం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగపేట, ఫిబ్రవరి 20: బిల్ట్ కార్మికులకు న్యాయం జరిగేలా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ శాసనసభా పక్ష నేత, ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి అన్నారు. బొగ్గు బావుల పర్యటనలో భాగంగా భద్రాది కొత్తగూడెం జిల్లా నుండి భూపాలపల్లికి వెళ్తున్న కిషన్ రెడ్డి మార్గమధ్యంలో సోమవారం రాత్రి 9 గంటలకు మంగపేట మండలంలోని కమలాపురంలో బిఎంఎస్ కార్యాలయంలో బిల్ట్ కార్మికులు, వారి కుటుంబాలతో సమావేశమయ్యారు. తాము, తమ కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను బిఎంఎస్ నాయకులు లింగంపెల్లి శ్రీనివాసరావు, ఆళ్ళ మధుసూదన్‌లు ఈ సందర్భంగా కిషన్‌రెడ్డికి వివరించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, బిల్ట్ కర్మాగారం, కార్మిక సమస్యలపై అసెంబ్లీ సమావేశాలలో బిజెపి చర్చించిందన్నారు. బిల్ట్ కంపెనీ మనుగడ కోసం రాయితీలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థ యాజమాన్యం మెడలు వంచి కర్మాగారంలో పునరుత్పత్తి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేతనాలు రాకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని త్వరలో ఒకనెల వేతనం చెల్లించే అవకాశం ఉందన్నారు. బిల్ట్ అంశం త్వరలో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో తీవ్రవాద ప్రాబల్యం ఎక్కువగా ఉన కాలంలో కూడా బిల్ట్ కర్మాగారం నడిచిందని, ఇప్పుడు యాజమాన్యం వైఖరి ఏమిటో స్పష్టంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అవస్థలు పడుతున్న కార్మికులకు బిజెపి అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కొత్త దశరధం, బిజెపి భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు పాపన్న, నాయకులు చదువు రాంచంద్రా రెడ్డి, ఉషాకిరణ్, భారతి తదితరులు పాల్గొన్నారు.