తెలంగాణ

పొలంలో నడవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఫిబ్రవరి 29: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై ఆవగింజంత అవగాహన లేకున్నా చెప్పుడు మాటలు విని ఎఐసిసి నాయకులు దిగ్విజయ్ సింగ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అభివృద్ధిపై వాస్తవాలను తెలుసుకోవాలంటే రైతు క్షేత్రంలో పర్యటించాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు హితవుపలికారు. కారులో తిరిగితే రైతుల అభివద్ధి కనిపించదని కారు దిగి పొలంలో నడిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. సోమవారం సంగారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి, కొండాపూర్, సదాశివపేట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు చెప్పుడు మాటలు వింటున్న దిగ్విజయ్ సింగ్ రాష్ట్రంలో పర్యటించి ఏవేవో మాట్లాడుతున్నారని ఆయన మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మబోరన్నారు. గాంధీ భవన్‌లో కూర్చుండి ప్రెస్‌మీట్లకే పరిమితమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రాష్ట్ర అభివృద్ధి ఎలా కనిపిస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి ఏలా ఉందో రైతుల పొలాల వద్దకు వెళ్లి అడిగితే సమాధానం లభిస్తుందన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పాలనలో వేసవి కాలం వచ్చిందంటే రైతులు కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు, పంపుసెట్ల వద్ద పడిగాపులు కాసారని, తమ ప్రభుత్వం వచ్చాక తొమ్మిది గంటల పాటు నాణ్యమైన కరెంటును సరఫరా చేస్తుందన్నారు. కాంగ్రెస్ పాలనలో కేవలం 6 వేల మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తే తాము 9 వేల మెగావాట్ల కరెంటు సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. మరో 500 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయాలని ట్రాన్స్‌కో అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారంటే రైతాంగం పట్ల తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. భవిషత్తులో భూమికి భారమయ్యేంతగా వరిధాన్యం ఉత్పత్తి అవుతుందని ధీమా వ్యక్తం చేసారు. వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుడితే పరిహారం పేరిట రైతులను ఎగతోసి అడ్డుకునేందుకు కాంగ్రెస్, టిడిపిలు కుట్రలు పన్నుతున్నాయని, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రాజెక్టుల నిర్మాణం ఆగదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపాలని ప్రయత్నిస్తే రైతులే ఆ పార్టీలను భూ స్థాపితం చేస్తారన్నారు. అభివృద్ధి అంటే ఏమిటో తెలియని వారు కూడా అవాక్కులు చవాక్కులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పేరుకే జిల్లా కేంద్రమైనా సంగారెడ్డి పట్టణం ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదంటే గత పాలకుల వైఫల్యాలేనని విమర్శించారు. త్వరలోనే సిఎం కెసిఆర్ సంగారెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తారని స్పష్టం చేస్తూ సిఎం సంగారెడ్డికి రారని కొనసాగుతున్న ప్రచారాన్ని మంత్రి హరీష్‌రావు ఖండించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 300 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదోద్దీన్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జడ్పీ చైర్ పర్సన్ రాజమణి, కలెక్టర్ మానిక్కరాజ్ కణ్ణన్, జెసి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సంగారెడ్డిలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు