తెలంగాణ

కరవులోనూ వివక్షా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కరవు చర్చతో తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది. రాష్ట్రంలో నెలకొన్న అనావృష్టి, కరవు మండలాల ఎంపిక విధానాలపై తెరాస, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య ఆదివారం హోరాహోరీ చర్చ సాగింది. చర్చకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. రెండు దఫాలు కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెదేపా ఎమ్మెల్యేలు ఒకసారి కాంగ్రెస్‌వెంట ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సీటువద్దకు దూసుకెళ్ళడం ఆగ్రహావేశాలకు దారి తీసింది. ఆదివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో అనావృష్టి పీడిత మండలాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. తొలుత కాంగ్రెస్ ఎమ్మెల్యే జి చిన్నారెడ్డి మాట్లాడుతూ 443 మండలాల్లో కరవుంటే రాష్ట్ర ప్రభుత్వం 231 మండలాలను మాత్రమే ప్రకటించిందని చెప్పారు. పైగా ఆదిలాబాద్, ఖమ్మంలో ఒక్క మండలాన్నీ ప్రకటించలేదని, మెదక్, నిజామాబాద్‌లో అన్ని మండలాలనూ ప్రకటించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే టి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ మెదక్ సిఎం సొంత జిల్లా కనుక ఆ జిల్లాలో అన్ని మండలాలను, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి చెందిన నిజామాబాద్ జిల్లాలోని అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో ఒక్క మండలాన్నీ ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. అందుకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రతిస్పందిస్తూ కరవు మండలాల ఎంపికకు నియమ నిబంధనలు ఉన్నాయని, ఇష్టం వచ్చినట్టు ఎంపిక చేయడం సాధ్యంకాదన్నారు. మైనస్ 14శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైన మండలాలను శాస్ర్తియ పద్ధతిలో ఎంపిక చేయడం జరిగిందన్నారు. 50 శాతంకంటే పంట తగ్గితే కరవు మండలాలుగా ప్రకటిస్తారని పేర్కొన్నారు. కరవును ఎదుర్కొవడానికి కేంద్రాన్ని 3 వేల కోట్లు కోరగా, 791 కోట్లు సాయం అందిస్తామని చెప్పి ఇప్పటి వరకూ 56 కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు. ఈ ఆర్థిక బడ్జెట్‌లో 702 కోట్లు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. రైతుల నుంచి విజయ డైరీ కొనుగోలు చేసే పాలకు లీటరుకు 4 రూపాయల ప్రోత్సాహకంగా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. స్పింక్రర్లు, డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సాహానికి నాబార్డు నుంచి వెయ్యి కోట్లు తీసుకుంటున్నట్టు చెప్పారు. దీంతో లక్షా 25 వేల హెక్టార్లలో సాగు పెంచుతామన్నారు. గ్రామీణ నీటి పథకానికి (ఆర్‌డబ్ల్యుఎస్) 329 కోట్లు అందుబాటులో ఉన్నాయని, రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి పోచారం తెలిపారు.
పోడియాన్ని చుట్టుముట్టిన కాంగ్రెస్
స్పీకర్ మధుసూదనాచారి తర్వాత ప్రశ్నను చేపట్టబోతుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టూ చేరి నినాదాలు చేశారు. ఈ ప్రశ్న వేసిన మిగతా సభ్యులకూ మట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆవేశంతో పాలకపక్షం వైపు వెళ్ళి మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి తన చేతుల్లోని పేపర్లను చూపిస్తూ పెద్దగా మాట్లాడసాగారు.
ఇదేనా పద్ధతి: కడియం ఆగ్రహం
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ఇదేనా పద్ధతి అని మండిపడ్టారు. కరవుపై చర్చించేందుకు నోటీసు ఇస్తే సుదీర్ఘంగా మాట్లాడవచ్చన్నారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్‌లోని కొన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని హైకోర్టు మూడు వారాల క్రితం ఆదేశిస్తే, 6 వారాలైనా చర్య తీసుకోలేదని విమర్శించారు. స్పీకర్ చర్చను ముగించాలని మైక్ కట్ చేయడంతో కాంగ్రెస్ సభ్యులు మరోసారి స్పీకర్ పోడియం వద్దకెళ్లి నినాదాలు చేశారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేత కె జానారెడ్డి మాట్లాడుతూ సమస్య తీవ్రతను బట్టి తమ సభ్యుడు ఆవేశానికి లోనై మంత్రిస్థానం వద్దకు వెళ్ళారన్నారు.
మావైపూ ఆవేశం ఉన్నవారున్నారు: కెటిఆర్
మంత్రి కె తారక రామారావు మాట్లాడుతూ లోగడ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన జీవన్‌రెడ్డి మంత్రి వద్దకు పరుగెత్తుకుంటూ వస్తే జానారెడ్డి సమర్థిస్తున్నారని అన్నారు. తమవైపూ కొత్తగా ఎన్నికైన, ఆవేశం ఉన్న సభ్యులు ఉన్నారని అన్నారు. మంత్రి పోచారం వైపు పేపర్లు గిరాటు వేశారని, ఇదెక్కడి పద్ధతని ప్రశ్నించారు. కిరణ్‌కుమార్ రెడ్డి సిఎంగా ఉన్నప్పుడు ఇన్‌పుట్ సబ్సిడీ అడిగితే ఒక్క పైసా ఇవ్వలేదని గుర్తు చేశారు. సిఎం ఛాంబర్ వైపు తాము కింద కూర్చుని ఆందోళన చేపడితే ఇప్పుడు మాట్లాడుతున్న వారు అప్పుడునవ్వారని, తమ కాళ్ళను తొక్కుకుంటూ వెళ్ళారని గుర్తు చేశారు. పాల సేకరణకు 4 రూపాయల ప్రోత్సాహకం ఇచ్చిన తర్వాత 5 లక్షల లీటర్లు డెయిరీ కొనుగోలు చేస్తున్నదని తెలిపారు.
జీవన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: కడియం
కడియం మాట్లాడుతూ జీవన్‌రెడ్డి దాడి చేసేంత పని చేశారని, జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తున్నానని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ కరవుపై నోటీసు ఇస్తే స్వల్ప వ్యవధి కింద చర్చకు అనుమతిస్తామని అన్నారు. జానారెడ్డి మాట్లాడుతూ కరవుపై ఇప్పటికే సుదీర్ఘంగా చర్చించామని, మరో గంట చర్చించి ముగించాలని సూచించారు. అందుకు స్పీకర్ అనుమతించలేదు. దీంతో జానారెడ్డి తిరిగి మాట్లాడుతూ కరవుపై ప్రశ్న అడిగిన వారికీ మాట్లాడేందుకు అనుమతి ఇవ్వనందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామని ప్రకటించి వెళ్ళారు.
ముఖం మీద పేపర్ వేశారు: పోచారం
మంత్రి పోచారం మాట్లాడుతూ మంత్రి స్థానం వద్దకు వచ్చి ముఖంపై పేపర్ వేయడం మొదటిసారి చూస్తున్నానని అన్నారు. కరవు మండలాల పరిశీలనకు నియమించిన కమిటీకి కోర్టు ఇచ్చిన తీర్పును అందజేశామని, కమిటీ పరిశీలిస్తున్నదని ఆయన చెప్పారు.

చిత్రం జీవన్ రెడ్డి