తెలంగాణ

హైదరాబాద్‌లోనే ఏవియేషన్ షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ఈనెల 16న ప్రారంభమైన అంతర్జాతీ య విమానాల సదస్సు, ప్రదర్శన ఆదివారంతో ముగిసింది. ఈ ప్రదర్శన విజయవంతమైన నేపథ్యంలో హైదరాబాద్‌లోనే ఇండియా ఏవియేషన్ షో-2018ను నిర్వహించనున్నట్టు భా రత విమాన సర్వీసుల శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్ చూబె తెలిపారు. 2018 మా ర్చి 14 నుంచి 18 వరకు అంతర్జాతీ య విమానాల పండగ బేగంపేట వి మానాశ్రయంలోనే జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఐదు రోజులపాటు జరిగిన ఐదవ అంతర్జాతీయ ప్రదర్శనలో పలు దేశాలకు చెందిన సుమారు ఐదువేలమంది విమానాల ఉత్పత్తిదారులు, ఎమ్‌ఆర్‌ఓ, ప్రొవైడర్లు, ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు, ఎయిర్‌లైన్స్ టెక్నాలజీ ఇంజనీర్లు, సర్వీసు ప్రొవైడర్లు, ఇనె్వస్టర్లు, ఫైనాన్షియల్ సంస్థలు, మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్స్ పా ల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా పలు సంస్థలు ఎయిర్‌బస్ వంటి వి మాన సంస్థలతో ఎంఓయు కుదుర్చుకున్నాయని చూబె తెలిపారు. ఢిల్లీలో, తెలంగాణలో విమాన శిక్షణ సంస్థలను నెలకొల్పేందుకు ప్రభుత్వం ఎంఓయు కుదుర్చుకుందని, హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో విమాన ప్రయాణికుల సంఖ్య మరింత పెరగగలదనే విమాన సర్వీసుల శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్ చూబె ఆశాభావం వ్యక్తం చేశారు.
chitram...
ఎయర్ ఇండియా విమానం వద్ద సందర్శకుల కోలాహలం..చివరి రోజు కనువిందు చేసిన వైమానిక విన్యాసాలు