రాష్ట్రీయం

బాసరలో విశ్వయోగి విశ్వంజీ పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, డిసెంబర్ 14: ఆదిలాబాద్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞానసరస్వతిదేవి ఆలయంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు విశ్వయోగి విశ్వం జీ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి చేరుకున్న విశ్వంజీకి ఆలయ అర్చకులు, అధికారులు మంగళవాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి చెంత ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహింపచేసి హారతినిచ్చి ఆశీర్వదించారు. ఆల య ప్రధాన అర్చకుడు విశ్వంజీకి పట్టు వస్త్రాలతో సత్కరించి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్స్‌పెక్టర్ గిరిధర్, సిబ్బంది పాల్గొన్నారు.
chitram..
బాసర ఆలయంలో విశ్వగురువు విశ్వంజీ పూజలు నిర్వహిస్తున్న దృశ్యం