తెలంగాణ

ప్రవాస భారతీయుల భద్రతకు కేంద్రం జోక్యం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఫిబ్రవరి 26 : ప్రవాస భారతీయులకు భద్రత కల్పించేందుకు కేంద్రం జోక్యం చేసుకొని అమెరికా వెళ్లి ప్రశాంత వాతావరణం వచ్చేలా చర్య లు తీసుకోవాలని ఏఐసిసి కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హ నుమం తరావు డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆనాలోచిత రెచ్చగొట్టే వ్యాఖ్యల కారణంగా ప్రవాస భారతీయులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయన్నారు. అమెరికాలో ఇతర దేశాల వారు ఉండవద్దని ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకోవడానికి చేసిన యత్నంలో భాగంగా ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్నారు. జాతి వివక్ష వల్ల ఇటీవలే కాన్సన్‌లో అమెరికన్ జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు శ్రీనివాస్ మృతి చెందాడని ఆయన తెలిపారు. ఆదివారం సిద్దిపేట శివారు పొన్నాల వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికాలో విష సంస్కృతి, గన్ కల్చర్ పెరుగుతోందని, ప్రశాంత వాతావరణం చెడగొడుతున్నారన్నారు. మృతుడు శ్రీనివాస్ భార్య అడిగిన ప్రశ్నలకు ట్రంప్ సమాధానం చెపుతారా అని ప్రశ్నించారు. ముంబాయి ఎన్నికల్లో ఏదో ఘనకార్యం సాధించినట్లు బిజెపి నాయకులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉత్సవ పూరితంగా వ్యవహరించడం తగదన్నారు. ఎన్నోమార్లు అమెరికా వెళ్లిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకి తెలుగు ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కనబడటం లేదా అని ఆయన ప్రశ్నించారు. మరి న్ని దారుణాలు చోటుచేసుకోకముందే కేంద్రం జోక్యం చేసుకొని అమెరికా అధ్యక్షుడితో చర్చించి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను అక్కడకు పంపించి ప్రవాస భారతీయులకు భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ఎన్నికలను విడిచి ఇబ్బందుల్లో ఉన్న ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. దేశంలో ఇప్పటివరకు ఆత్మహత్యలు, ఆకలిచావులు జరిగితే ప్రస్తుతం కొత్త చావులు మొదలయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జీవనోపాధికి విదేశాలకు వెళ్లిన బిడ్డలు క్షేమంగా వస్తారో..? ..రారోననే? అభద్రతా భావం నెలకొందన్నారు.
కాంగ్రెస్‌పై టిఆర్‌ఎస్ నేతల అనుచిత వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌పై టిఆర్‌ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని విహెచ్ సూచించారు. సిఎం కెసిఆర్ ఎన్నికల ముందు ఏం మాట్లాడినా చెల్లిందన్నారు. సిఎం కెసిఆర్ దొర అహంకారంతో మాట్లాడుతున్నారని, భాష మార్చుకోవాలని ఆయన సూచించారు. కాగా, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి జెఎసి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపడితే జెఎసి చైర్మన్ కోదండరామ్‌ను పోలీసులచే బలవంతంగా అరెస్టు చేయించి ర్యాలీని అడ్డుకోవడం మంచి పద్ధతి కాదన్నారు.