ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అగ్రిగోల్డ్ యాజమాన్యం పాల్పడిన మోసాలపై బాధితులు భగ్గుమన్నారు. అధికార తెలుగుదేశం పార్టీ మినహా మిగతా పార్టీలన్నీ బాధితులకు బాసటగా నిలుస్తామని ముందుకొచ్చాయి. ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి వెంటనే బాధితులను ఆదుకోకపోతే పోరు తీవ్రం చేస్తామని హెచ్చరించాయి. సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశాయి. సంస్థ ఆస్తుల కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్, కొందరు మంత్రులు, అధికారపక్ష ప్రజాప్రతినిధుల హస్తాలు వున్నట్లు ప్రచారం జరుగుతోందంటూ అఖిల పక్ష నాయకులు సోమవారం ఇక్కడి జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ధ్వజమెత్తారు. దీనిపై అసెంబ్లీలో చర్చ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సిబిఐతో విచారణ జరిపించాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ముఖ్యమంత్రి దీనిపై సరైన సమాధానం చెప్పనిపక్షంలో గ్రామస్థాయి నుండి ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకుని డిపాజిటర్లకు చెల్లించాలని, ప్రభుత్వమే కొంత మొత్తాన్ని ముందుగా చెల్లించి ఆత్మహత్యల్ని నివారించాలని డిమాండ్ చేస్తూ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతకుముందు జరిగిన భారీ ర్యాలీలో రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన వేలాది మంది బాధితులు నగర వీధుల్లో కదంతొక్కారు.

అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళనకు సభలో
సంఘీభావం ప్రకటిస్తున్న అఖిలపక్ష నేతలు