తెలంగాణ

తరలిరానున్న చైనా కంపెనీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలను స్థాపనకు చైనా కంపెనీలు పెద్దఎత్తున తరలిరానున్నట్టు చైనా రాజధాని బీజింగ్‌లో భారత కాన్సులర్ నామ్ గ్యా సి కంపా వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానాన్ని చైనా కంపెనీలు పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయని కంపా వెల్లడించారు. క్యాంపు ఆఫీసులో మంగళవారం సాయంత్రం భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారి గౌరవ్‌శ్రేష్టతో కలిసి కంపా సిఎం కె చంద్రశేఖర్‌రావుతో సమావేశమయ్యారు. చైనాలోని పలు కంపెనీలు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టిఎస్-ఐపాస్ చట్టాన్ని, ఇక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆధ్యయనం చేశాయని తెలిపారు. అధ్యయనం తర్వాత ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలను స్థాపనకు సానుకూలంగా ఉన్నాయని, త్వరలో అక్కడి నుంచి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, తమ సంస్థలను ఇక్కడ స్థాపించడానికి పెద్దఎత్తున తరలిరానున్నాయని కంపా వివరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ తాను ఇటీవల చైనా వెళ్లినప్పుడు పలు కంపెనీలతో మాట్లాగా, వారు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తికనబర్చడమే కాకుండా వాటి ప్రతినిధులు స్వయంగా ఇక్కడి వచ్చి పరిస్థితులను అధ్యయనం చేసి వెళ్లారన్నారు. హైదరాబాద్ నగరంలో వౌలిక సదుపాయాల కల్పనకు, కనీస అవసరాలు తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ముఖ్యమంత్రి వివరించారు. సమావేశంలో సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, సిఎం అదనపు కార్యదర్శి శాంతికుమారి, టిఎస్ ఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ ఇవి నర్సింహరెడ్డి పాల్గొన్నారు.

చిత్రం... సిఎం కెసిఆర్‌ను మంగళవారం కలిసిన చైనాలో భారత కాన్సులర్ నామ్ గ్యా సి కంపా