తెలంగాణ

ఎమ్మల్సీగా జాఫ్రీ ఏకగ్రీవ ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: తెలంగాణ శాసన మండలి హైదరాబాద్ స్థానిక సంస్థల స్థానానికి సయ్యద్ అమీన్ ఉల్ జాఫ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి అద్వైతకుమార్ అధికారికంగా ప్రకటించారు. అంతేగాక, ఆయన ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రాన్ని కూడా అందజేశారు. ఎమ్మెల్సీ స్థానానికి అధికార టిఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా జాఫ్రీ ఒకే ఒక్కడు నామినేషన్ దాఖలు చేశారు. ఇతర పార్టీల నుంచి ఎవరూ పోటీల్లో లేకపోవటంతో జాఫ్రీ ఎన్నిక ఏకగ్రీవమైందని అధికారులు తెలిపారు. జాఫ్రీ మాట్లాడుతూ తనకు మద్దతు తెలిపి, తనను మరో సారి శాసన మండలి స్థానానికి ఎన్నుకున్నందుకు సిఎం కెసిఆర్, మజ్లిస్ అధినేత అసదుద్దిన్ ఓవైసీకి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల పరిశీలకులు వి.ఎన్. విష్ణు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి మజ్లిస్ ఎమ్మెల్యే వౌజం ఖాన్ హజరయ్యారు.

చిత్రం..జాఫ్రీకి ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రాన్ని అందజేస్తున్న రిటర్నింగ్ అధికారి అద్వైతకుమార్