తెలంగాణ

బాంచెన్ దొర.. దుస్థితికి స్వస్తి చెప్పాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: తెలంగాణలో ఆనాడు బాంచెన్ దొర, నీ కాలు మొక్కుతా అనే దారుణ పరిస్థితులకు స్వస్తి పలికి ప్రజలకు స్వేచ్ఛను కలిగించింది తెలుగుదేశం పార్టీయేనని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. ఎపి అసెంబ్లీ భవన ప్రారంభ సమయంలో చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని దురుద్ధేశపూర్వకంగా పెడర్థాలు తీస్తూ కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మభ్యపెడుతోందని అన్నారు. శనివారం నాడిక్కడ ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టిడిపి ఆవిర్భావానికి ముందు కొన్ని కుటుంబాల చేతిలోనే రాజకీయ ఆదిపత్యం ఉండేదని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత పాదాల దగ్గర కలెక్టర్ స్థాయి ఉద్యోగి మాట్లాడిన తీరు, దళిత విద్యార్థి నాయకుడిగా ఎదిగిన బాల్క సుమన్ కరీంనగర్ కలెక్టరేట్‌లో స్వయంగా నేను రెడ్డిని కాను, రావునీ కాదని వాపోయిన సంగతిని గుర్తు చేస్తూ ఇవీ ఈనాటి పరిస్థితులని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇవ్వాలని భావించి ఆనాడు ఎన్టీఆర్ పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి, బాంచెన్ దొర..కాలుమొక్కుతా పరిస్థితికి ఉద్వాసన పలికారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేల కోసం లగ్జరీ ఇళ్ల నిర్మాణానికి ఖర్చు చేస్తున్న ప్రభుత్వం పేదల డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఎందుకు అదే వేగంగా నిర్మించలేకపోతోందని ప్రశ్నించారు. ఇరిగేషన్‌లో పాత పనులకు కొత్త అంచనాలు వేసి చెల్లింపులు చేయడం తప్ప రైతులకు మేలు జరిగిందేమీ లేదని అన్నారు.
ఏకంగా హాస్టళ్ల వద్దే పోలీసు క్యాంప్‌లా?: రేవంత్ రెడ్డి
పరాయి పాలనలో ఉస్మానియా విశ్వవిద్యాలయం గేటు వరకే పోలీసులు పరిమితమైతే, ఇప్పుడు కెసిఆర్ పాలనలో హాస్టళ్ల వద్ద పోలీసులు క్యాంపులు పెట్టే పరిస్థితి నెలకొందని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. శనివారం టిడిపి కేంద్ర కార్యాలయంలో ఓయూ విద్యార్థి సంఘాల నేతలతో కలిసి రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ఉద్యోగాలను సీమాంధ్రులు కొల్లగొడుతున్నారని, వారిని ఇక్కడ నుంచి వెళ్లగొడితే లక్షలాది ఉద్యోగాలు తెలంగాణకు వస్తాయని చెప్పి వాటితో ఇంటికో ఉద్యోగం ఇస్తానని గతంలో కెసిఆర్ హామీ ఇచ్చిన సంగతిని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడి మూడేళ్లయినా ఇప్పటిదాకా ఆరు వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఓయూకు చెందిన 36 విద్యార్థి సంఘాల నేతలు, కళాకారులు కలిసి మరో పోరాటానికి సిద్ధమవుతున్నారని, వారికి టిడిపి తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు. కెసిఆర్ విద్యార్థులపై కేసులు పెడితే వారు తిరగబడతారని హెచ్చరించారు. బలహీనవర్గాలకు విద్య, ఉద్యోగాలు కల్పించాలి తప్ప గొర్రెలు, బర్రెలు కాదని హితవు పలికారు. ఈ నెల 6న జరుగనున్న అఖిలపక్ష సమావేశానికి టిడిపి తరఫున హాజరు కావాలని ఓయూ విద్యార్థులను రేవంత్ ఆహ్వానించారు.