తెలంగాణ

ప్రజాధనాన్ని దోచుకుంటున్న కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, మార్చి 6: బంగారు తెలంగాణ అంటూ ప్రజాధనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం రాత్రి కామారెడ్డి జిల్లాలోని బాన్స్‌వాడ డివిజన్ కేంద్రంలో ఆర్టీసీ బస్‌డిపో సమీపంలో స్థానిక టిడిపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ‘ప్రజాపోరు’ సభకు హాజరై ప్రసంగించారు. రాష్ట్ర సిఎం, మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత మొదటి బడ్జెట్‌లో లక్షకోట్ల రూపాయలు, రెండవ బడ్జెట్‌లో లక్ష 15 వేల కోట్ల రూపాయలు, మూడవ బడ్జెట్‌లో లక్ష 35 వేల కోట్ల రూపాయలు మొత్తం 3 లక్షల 50 వేల కోట్ల రూపాయ ల బడ్జెట్ కేటాయించిందన్నారు. మరో లక్ష 50 వేల కోట్ల తెలంగాణ సర్కార్ అప్పు తీసుకుని వచ్చి, మొత్తం 5 లక్షల కోట్ల రూపాయల లెక్క ప్రజలకు చెప్పాలని ఆయన ప్రజాపోరు బహిరంగ సభ నుండి సవాల్ చేశా రు. 10 జిల్లాలకు లెక్క వేసిన ఒక్కో జిల్లాకు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండగా, ఇందులో ఎన్నో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. మిషన్ భగీరథ పేరుతో కమీషన్లకు కక్కుర్తి పడ్డారని అన్నారు. బంగారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే నిరుద్యోగ యువకులకు 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారని, ఎక్కడ ఉద్యోగాలిచ్చారని ప్రశ్నిస్తూ, నిరుద్యోగులను మోసం చేసిన సిఎం కెసిఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పేరోజు లు దగ్గర పడ్డాయని అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, మైనార్టీ ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌లు, విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్, ఇంటింటికీ నల్లాకనెక్షన్, నిరుపేదలకు డబుల్‌బెడ్‌రూం ఇవన్నీ ఎక్కడ అమలు చేశారని ఆయన ప్రశ్నించారు. రైతులకు రుణమాపి అంటూ ఏడాదికి 25 శాతం ఇవ్వడంతో రైతులకు ఆ రుణమాఫీ ఇచ్చి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.