తెలంగాణ

ఎటిఎంలపై దొంగల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 15: చోరీలకు పాల్పడడమే ప్రవృత్తిగా మార్చుకున్న దొంగలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. వర్ని, కోటగిరి మండలాల్లో ఎటిఎం సెంటర్లను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున సొమ్మును లూటీ చేయగా, జిల్లా కేంద్రంలోనూ శ్రద్ధానంద్ గంజులోని ఏడు దుకాణాల్లో వరుస చోరీలకు పాల్పడి నాలుగు లక్షల రూపాయల నగదును అపహరించుకుపోయారు. ఒకేరోజున వేర్వేరు ప్రాంతాల్లో ఈ చోరీ సంఘటనలు చోటుచేసుకోవడం పోలీసు అధికారులను కలవరపాటుకు గురి చేశాయి. ఎస్పీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి చోరీకి గురైన ఎటిఎం సెంటర్లను పరిశీలించి దోపిడీ జరిగిన తీరు గురించి పోలీసు సిబ్బందిని, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కోటగిరి మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో గల ఎస్‌బిహెచ్ ఎటిఎంతో పాటు ఇండియా నెం.1 ఎటిఎం సెంటర్లలో ఆగంతకులు మంగళవారం తెల్లవారుజామున చొరబడి దోపిడీకి తెగబడ్డారు. ముఖాలకు ముసుగులు ధరించి వచ్చిన దుండగులు తమవెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్లతో ఎటిఎం మిషన్‌లను సునాయసంగా పగులగొట్టి అందులోని క్యాష్ బాక్సులను ఎత్తుకెళ్లారు. ఎస్‌బిహెచ్ ఎటిఎంలో సుమారు 9.50లక్షల రూపాయలు, ఇండియా నెం.1 ఎటిఎం సెంటర్‌లో 2.34లక్షల రూపాయల నగదు దొంగల చేతికి చిక్కింది. అదేవిధంగా వర్ని మండలం రుద్రూర్ గ్రామంలోని ఎటిఎం కేంద్రాలపైనా దొంగలు కనే్నసి పెద్ద మొత్తంలో సొమ్మును దోచుకెళ్లారు. రుద్రూర్‌లోని బస్టాండ్ సమీపంలో గల ఎస్‌బిఐ ఎటిఎం కేంద్రంలో 31లక్షల రూపాయల నగదు బాక్సు వారి చేతికి చిక్కింది. సమీపంలోనే ఉన్న ఇండియా నెం.1 ఎటిఎం కేంద్రంలోనూ చోరీకి విఫలయత్నం చేశారు. గ్యాస్ కట్టర్‌లను ఉపయోగించినప్పటికీ, క్యాష్ బాక్సు బయటకు రాకపోవడం, అప్పటికే తెల్లవారుజాము సమయం మించిపోతుండడాన్ని గమనించిన దొంగలు అక్కడి నుండి ఉడాయించారు. పై రెండు వేర్వేరు ప్రాంతాల్లోనూ ఒకే ముఠా ఈ చోరీలకు పాల్పడి ఉంటుందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అన్ని చోట్లా గ్యాస్ కట్టర్లను వినియోగించి ఎటిఎం మెషీన్‌లను తెరువడంతో ఈ నేరాలకు పాల్పడింది ఒకే ముఠా అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. పై రెండు ప్రాంతాలు ఒకింత సమీపంలోనే ఉంటూ మహారాష్టక్రు వెళ్లే మార్గంలో ఉండడంతో పొరుగు రాష్ట్రానికి చెందిన ముఠా పనే అయి ఉంటుందని భావిస్తున్నారు. ఎటిఎం సెంటర్లలో ఉంచే క్యాష్ బాక్స్ కోడ్‌తోనే తెరుచుకుంటుంది. దీనిని గమనించిన దొంగలు ఏకంగా క్యాష్ బాక్స్‌నే తమ వెంట ఎత్తుకెళ్లడంతో డబ్బుల కోసం ఎక్కడైనా నిర్జన ప్రదేశంలో వాటిని ధ్వంసం చేసేందుకు అవకాశం ఉంటుందనే భావనతో పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఎటిఎం సెంటర్లలో సి.సి కెమెరాల ఫుటేజీలో నిందితుల కదలికలు రికార్డు అయినప్పటికీ, వారు ముఖాలకు ముసుగులు ధరించడంతో గుర్తించడం కష్టంగా మారింది. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, బోధన్ డిఎస్పీ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలాలకు చేరుకుని పరిశీలించారు. సంబంధిత బ్యాంకుల అధికారులను రప్పించి ఏమేరకు నగదు అపహరణకు గురైందనే వివరాలు ఆరా తీశారు. ఇదిలాఉండగా, జిల్లా కేంద్రంలోనూ దొంగలు చెలరేగిపోయారు. అనునిత్యం జన సంచారంతో రద్దీగా ఉండే నిజామాబాద్‌లోని శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్ యార్డులో ఏకంగా ఏడు దుకాణాల్లో వరుస చోరీలకు తెగబడ్డారు. తమ వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్లతో దుకాణాల తాళాలు ధ్వంసం చేసి వ్యాపారులు బీరువాలలో దాచి ఉంచిన సుమారు 4లక్షల రూపాయల నగదును అపహరించుకుపోయారు. సోమవారం అర్ధరాత్రి దాటిన అనంతరం ఈ చోరీలు జరిగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యాపారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.