తెలంగాణ

ప్రాజెక్టులను అడ్డుకుంటే రాళ్లతో కొడతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 7: రాష్ట్రంలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటే రాళ్ల ప్రజలు కొట్టే రోజులు వస్తాయని, అప్పుడు ఎవరూ బాధ్యులు కారని టిఆర్‌ఎస్ లోక్‌సభాపక్షనేత, మహబూబ్‌నగర్ ఎంపి జితేందర్‌రెడ్డి ప్రతిపక్ష పార్టీల నేతలను హెచ్చరించారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లో మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి తన స్వగృహంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రానికి ఇంకా శని దాపురించే ఉందని అది కాంగ్రెస్, టిడిపి నాయకులేనని వారిని రాజకీయంగా పూర్తిగా భూస్థాపితం చేస్తే పూర్తిగా శనిపోతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టిస్తున్న వారిని వదిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకనే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల ద్వారా ఎవరు ఊహించని రీతిలో ప్రతిపక్షాల ఊహకు అందనిరీతిలో ఏకంగా నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. ఒక్క దేవరకద్ర నియోజకవర్గంలోనే 250 చెరువులు నింపామని దాదాపు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 600లకుపైగా చెరువులు నింపి రైతులకు సాగునీరు ఇస్తున్న ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదన్నారు. జలయజ్ఞం పేరిట గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కోట్ల రుపాయలు మొబలైజేషన్ ఆడ్వాన్స్ పేరిట దండుకున్న నాయకులు ప్రస్తుతం టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్, టిడిపి నాయకులకు సిగ్గుషరం లేదని ప్రాజెక్టులకు ఆటంకాలు సృష్టిస్తూ రాజకీయాలు చేస్తున్నారని వారిని ప్రజలు రాళ్లతో కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు. రానురాను వారి పరిస్థితి టైంపాస్ నేతలుగా మారనున్నారని పిచ్చోళ్ల మాదిరిగా తయారు కానున్నారని ఎద్దేవా చేశారు.