తెలంగాణ

కాంగ్రెస్ వాకౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: బడ్జెట్ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగిస్తుండగా సభ నుంచి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేసి నిరసన తెలిపారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం గత 33 నెలలలో అమలు చేసిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణను గవర్నర్ వివరిస్తూ ‘నా ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా కెజి నుంచి పిజి వరకు ఉచిత నిర్బంధ విద్యా వ్యవస్థను ప్రారంభించింద’ని అనగానే కాంగ్రెస్ సభ్యులు ఒక్కసారిగా నిలిచి గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలారు.
అయినప్పటికీ గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీతో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. గవర్నర్ మొదట కొద్దిసేపు తెలుగులో ప్రసంగించి ఆ తర్వాత ఇంగ్లీష్‌లో కొనసాగించి చివరలో మళ్లీ తెలుగులో మాట్లాడి ప్రసంగం ముగించారు. గవర్నర్ తన 29 పేజీల ప్రసంగాన్ని 10 గంటలకు ప్రారంభించి 40 నిమిషాలలో ముగించారు. అంతకుముందు గవర్నర్ శాసనసభకు చేరుకోగానే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ స్వాగతం పలికారు.
సభా సంప్రదాయం ప్రకారం గవర్నర్‌కు ఇరువైపుల స్పీకర్, శాసనమండలి చైర్మన్ ఆసీనులయ్యారు. సభ ప్రారంభానికి ముందే సభలోకి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి జరిపించిన సర్వేపై ఆసక్తిగా చర్చించుకున్నారు. సర్వేలో ప్రజల మన్ననలు ఎక్కువ శాతం పొందిన మంత్రులు, ఎమ్మెల్యేలను ఇతర సభ్యులు కరచాలనం చేసి అభినందనలు చెప్పుకోవడం సభలో కనిపించింది.

చిత్రం..శుక్రవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలనుద్దేశించి ప్రసంగించేందుకు వచ్చిన గవర్నర్ నరసింహన్‌ను
సభలోపలికి తోడ్కొని వెళ్తున్న సిఎం కెసిఆర్