తెలంగాణ

నేడు శృంగేరికి సిఎం కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: అయుత చండీయాగానికి శృంగేరి పీరాధిపతి భారతీ తీర్థానందస్వామిని స్వయంగా ఆహ్వానించడానికి బుధవారం సిఎం కె చంద్రశేఖర్‌రావు కర్నాటకలోని శృంగేరికి వెళ్లనున్నారు. బేగంపేట నుంచి హెలిక్యాప్టర్‌లో ఉదయం 11 గంటలకు బయలుదేరనున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని సిఎంవో సమాచారం. సిఎం వెంట ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి వెళ్లనున్నట్టు సమాచారం.
గురు రవిశంకర్‌కు ఆహ్వానం
ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌ను అయుత చండీయాగానికి హాజరు కావాల్సిందిగా కెసిఆర్ ఆహ్వానించారు. షిల్లాంగ్‌లో ఉన్న రవిశంకర్‌తో మంగళవారం వీడియో కాల్‌లో మాట్లాడారు. చండీయాగానికి హాజరై ఆశీర్వదించాలని సిఎం కోరగా, రవిశంకర్ సానుకూలంగా స్పందించారు. యాగం రాష్ట్ర ప్రజల్లో సౌభ్రాతృత్వం పెంచాలని రవిశంకర్ ఆకాంక్షించారు.