తెలంగాణ

ఖాళీ స్థలాల్లో వ్యాపార సముదాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ చార్మినార్, మార్చి 17: కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ఇందులో భాగంగా సంస్థకు చెందిన ఖాళీ స్థలాలను వినియోగించి ఏటా అదనంగా రూ. 30 కోట్ల వరకు ఆదాయం సమకూర్చుకుంటున్నట్లు రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం శాసన మండలిలో సభ్యులు కర్నె ప్రభాకర్, భూపతిరెడ్డి,విప్ పాతూరి సుధాకర్ రెడ్డి ఇతర సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని బస్ స్టాండ్‌లలో ఆర్టీసికి చెందిన ఖాళీ స్థలాలను వ్యాపార సముదాయాలుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఇలా ఇప్పటి వరకు 150 ఖాళీ స్థలాలను వాణిజ్య సముదాయాలుగా పెట్రోలు బంకులు, మినీ సినిమా హాళ్లు, హోటళ్లుగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఔత్సాహికులైన వివిధ సంస్థల నుంచి ఇందుకు వినతులను కూడా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. వీటిలో బివోటి పథకం కింద ఎంపిక చేసిన ఇరవై స్థలాలున్నట్లు ఆయన తెలిపారు. వీటికి 33 ఏళ్ల కాలపరిమితితో లీజుకు ఇచ్చేందుకు నిర్ణయించామని తెలిపారు. అదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, హైదరాబాద్ తదితర జిల్లాల్లో ఈ బివోటి సముదాయాల ప్రతిపాదనలు ఉన్నాయని వివరించారు. వివిధ రీజియన్‌లలోని 69 ఆర్టీసి ఖాళీ స్థలాలను గుర్తించి పెట్రోలు బంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. వీటిలో హెచ్‌పిసిఎల్ సంస్థకు 41 స్థలాలు, ఐవోసిఎల్ సంస్థకు 23 లీజుకు ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు ఏటా మరో రూ. 4.8 కోట్ల నిధులు సంస్థకు అదనపు ఆదాయంగా చేకూరుతోందని వివరించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ మదర్సాలలో అక్రమాలు జరిగిన విషయం వాస్తవమేనని, అందుకు బాధ్యులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.