తెలంగాణ

వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లడం సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: ప్రతి మనిషికి వ్యక్తిగత జీవితం ఉంటుందని, ఆ జీవితంలోకి వారి అనుమతి లేకుండా ఇతరు ప్రవేశించటం, కల్పించుకోవటం అనేది వారి ప్రైవసీకి భంగం కల్గించినట్టేనని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైకోర్టులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ల అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన దివంగత జస్టిస్ వై. సూర్యనారాయణ స్మారక ప్రసంగ కార్యక్రమంలో భాగంగా ‘రైట్ టు ప్రైవసీ’ అంశంపై ఎల్. నాగేశ్వరరావు కీలకోపన్యాసం చేస్తూ మనుషులందరికీ తమ వ్యక్తిగత జీవితాన్ని స్వేచ్ఛగా, సంతోషంగా గడిపే హక్కును రాజ్యాంగం కల్పించిందని, అట్టి వ్యక్తిగత జీవితంలోకి అనుమతి లేకుండా చొరబడటం ఆ హక్కును ఉల్లంఘించటమేనని అన్నారు. సమాచార సేకరణ సాకుగా చూపి పోలీసు అధికారులు ఫోన్ ట్యాపింగ్ వంటి చర్యలకు పాల్పడుతుంటారని, ఇది కూడా ఒకరకంగా ప్రైవసీ హక్కును హరించటమేనని అన్నారు. అమెరికా రాష్ట్రాల్లో, భారత దేశంలో వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన చట్టాలను గురించి ప్రస్తావిస్తూ ఆయన అమెరికాలో జరిగిన అక్రమ లిక్కరు కేసులో లూయిబ్రాండీ అనే న్యాయమూర్తి ఫోన్ ట్యాపింగ్ పై ఇచ్చిన రూలింగ్‌ను ఉదహరించారు. దివంగత జస్టిస్ సూర్యనారాయణ గురించి ప్రస్తావిస్తూ, తాను ఆయన శిష్యుడనని చెప్పుకోవటం ఎంతో గర్వంగా ఉందన్నారు. జస్టిస్ సూర్యనారాయణ కష్టించే మనస్తత్వం గలవారని, ప్రతి కేసును వాదించే ముందు పూర్వాపరాలు నిశితంగా పరిశీలించి కేసును ప్రజెంట్ చేసేవారన్నారు.
హైకోర్టు జడ్జి జస్టిస్ సివి నాగార్జునరెడ్డి మాట్లాడుతూ తాను యువ న్యాయవాదిగా పనిచేస్తున్నపుడు సూర్యనారాయణ కేసులు వాదించే తీరుచూసి ఎంతో ప్రభావితుడినయ్యానని అన్నారు. రైటు టు ప్రైవసీపై మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి వల్ల సోషల్ మీడియా వంటి సమాచార వ్యవస్థలు వచ్చాయని వీటి వల్ల ఏ విషయము దాచుకోలేనిదిగా, దాయలేనిదిగా మారిపోయిందన్నారు. ఇటువంటి వ్యవస్థలపై నియంత్రణ అవసరమని, లేని పక్షంలో ప్రైవసీకి అర్థమే ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామకృష్ణారెడ్డి, హైకోర్టు జడ్జి రజనీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వొకేట్ల అసొసియేషన్ అధ్యక్షుడు సి. నాగేశ్వరరావు, తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్ల అసోసియేషన్ అధ్యక్షుడు గండ్ర మోహన్‌రావు, జెఏసి చైర్మన్ రాజేందర్‌రెడ్డి, పలువురు జడ్జిలు, న్యాయవాదులు పాల్గొన్నారు.

చిత్రం.. దివంగత జస్టిస్ సూర్యనారాయణ స్మారక ప్రసంగం కార్యక్రమంలో
పాల్గొన్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ నాగేశ్వరరావు తదితరులు