తెలంగాణ

మెస్ ఛార్జీలు పెంచుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: తెలంగాణ రాష్ట్రంలో ఎవర్నీ అర్ధాకలితో ఉంచబోమని, విద్యార్ధులకు సైతం మెస్ చార్జీలు పెంచుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చెప్పారు. అదే విధంగా బిసి విద్యార్ధులు విదేశాల్లో చదువుకునేందుకు బడ్జెట్ కేటాయింపులు కుదించారని టిడిపి సభ్యుడు ఆర్ కృష్ణయ్య చేసిన ఆరోపణలను తోసిపుచ్చుతూ విదేశాల్లో ఎంత మంది బిసి విద్యార్ధులు చదువుకున్నా వారికి ఆర్ధిక సాయం ఇస్తామని శాచ్యురేషన్ పద్ధతిలో అమలుచేయాలని ప్రభుత్వం యోచిస్తోందని సిఎం పేర్కొన్నారు. హాస్టల్ విద్యార్ధుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించామని, ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలను చేపడతామని సిఎం చెప్పారు. ఎస్సీ గురుకులాల నిర్మాణానికి ఇప్పటికే స్థల సేకరణ పూర్తయిందని, దాంతో భవనాలకు నిధులను కేటాయించామని, బిసి గురుకులాలకు సంబంధించి స్థల సేకరణ జరగాల్సి ఉందని, అది పూర్తికాగానే నిధులను కేటాయిస్తామని సిఎం తెలిపారు. అలాగే ఇంజనీరింగ్ విద్యార్ధుల ఫీజులకు సంబంధించి ఎలాంటి సీలింగ్ పెట్టలేదని, ఎవరికైనా ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో ఇబ్బంది కలిగితే దానిని కూడా పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
ఏదీ తేలిగ్గా తీసుకోం
ఏ అంశాన్నీ తాము తేలిగ్గా తీసుకోమని, 266 వెటర్నరీ పోస్టులను భర్తీ చేశామని, మరో 60 మంది డాక్టర్లు మిగిలి ఉన్నారని చెబితే వారిని కూడా తాత్కాలిక ప్రాతిపదికపై తీసుకోమని సూచించామని సిఎం పేర్కొన్నారు. ఎంబిసిల ఎంపిక బాధ్యత బిసి కమిషన్‌కు అప్పగించామని, వారిచ్చిన నివేదిక ఆధారంగా ఎంబిసిలకు నిధులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. వాస్తవానికి ఎంబిసిలకు కేటాయించిన వెయ్యి కోట్లు ఏ విధంగానూ చాలవని అన్నారు.
ఎస్సీ సబ్ ప్లాన్ అమలుకు కొత్త చట్టం
ఎస్సీ సబ్ ప్లాన్ అమలుకు కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నామని, ఈ చట్టం కింద నిధులు వెచ్చించని అధికారులను శిక్షించే నిబంధనలు కూడా ఉంటాయని సిఎం పేర్కొన్నారు. సమగ్రమైన చట్టాన్ని త్వరలో ఈ సమావేశాల్లోనే తీసుకువస్తామని ఆయన వెల్లడించారు.
ఆ పథకంలో కేంద్రం వాటా లేదు..
గొర్రెల పెంపకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకంలో కేంద్రం వాటా ఏ మాత్రం లేదని సిఎం స్పష్టం చేశారు. ఎన్‌సిడిసి సంస్థ కేవలం వడ్డీకి అప్పు మాత్రమే ఇస్తుందని, అంతే తప్ప కేంద్రం ఎలాంటి గ్రాంట్ ఇవ్వడం లేదని చెప్పారు.తాము ఈ పథకం కింద 4వేల కోట్లు వెచ్చిస్తుండగా, కేంద్రం అన్ని రాష్ట్రాలకూ కలిపి 180 కోట్లు పెట్టిందని సిఎం గుర్తుచేశారు.