తెలంగాణ

బాహుబలి వస్తాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: ‘వచ్చే ఎన్నికల్లో మా పార్టీని గెలిపించేందుకు బాహుబలి వస్తాడు..’ అని సిఎల్‌పి నేత, ప్రతిపక్ష నాయకుడు కె.జానారెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ వాయిదాపడిన అనంతరం జానారెడ్డి కొంత సేపు మీడియాతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటమి చెందడం, రాహుల్ ఐరన్ లెగ్ అంటూ వస్తున్న విమర్శల గురించి ప్రశ్నించగా, ఐరన్ లెగ్గో కాదో భవిష్యత్తులో మీకే తెలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి గురించి ప్రశ్నించగా, వచ్చే ఎన్నికల్లో తమకు తిరుగు లేదని, గెలిపించేందుకు బాహుబలి వస్తాడని ఆయన తెలిపారు. ఎవరాయన అని ప్రశ్నించగా, ఓపిక పట్టాలంటూ ఆయన సమాధానాన్ని దాట వేశారు.