తెలంగాణ

అప్పుల చెల్లింపులో రాష్ట్రానికి ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నీతి అయోగ్ సిఫార్సుల కింద కేంద్రం ఈ ఏడాది వచ్చే రూ.11వేల కోట్ల నిధులను రుణంగా మంజూరు చేయనున్నట్లు రాష్ట్రప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో పాటు ఈ రుణాలకు అసలు, వడ్డీని మూడేళ్ల తర్వాతనే చెల్లించే విధంగా వెసులుబాటును కేంద్రం కల్పించనుంది. మిషన్ భగీరథ తదితర స్కీంలకు మూడేళ్ల వరకు రుణాలు చెల్లించనవసరంలేకుండా మారటోరియం సదుపాయం కల్పించనుంది. ఈ వివరాలను ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర బడ్జెట్ 1.49 లక్షల కోట్లు ఉంటే, రుణాలు రూ.1.50 లక్షల కోట్లు ఉన్నా, దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో వృద్ధిరేటు ఎక్కువగా ఉండడం, అంచనాకు తగ్గట్టుగా రాష్ట్ర పన్నుల ఆదాయం ఉండడం ప్రధాన కారణం. దేశ వ్యాప్తంగా అప్పుల్లో , బడ్జెట్‌లో తెలంగాణ ఆరవ స్ధానంలో ఉంది. గుజరాత్ రూ. 1.51 లక్షల కోట్ల బడ్జెట్, రూ.1.65 లక్షల కోట్ల రుణాలతో మొదటి స్ధానంలో, మహారాష్ట్ర రూ.265 లక్షల కోట్ల బడ్జెట్, రూ.3.56 లక్షల కోట్ల రుణాలతో, ఆంధ్రప్రదేశ్ రూ. 1.50 లక్షల కోట్ల బడ్జెట్, రూ.1.90లక్షల కోట్ల రుణాలతో, తమిళనాడు రూ.148 లక్షల కోట్ల బడ్జెట్, రూ.2.52 లక్షల కోట్ల రుణాలతో, కర్నాటక రూ.1.63లక్షల కోట్ల బడ్జెట్, రూ.1.75 లక్షల కోట్ల రుణాలతో, తెలంగాణ రూ.1.49 లక్షల కోట్ల బడ్జెట్, రూ.1.40 లక్షల కోట్ల రుణాలతో ఆరవ స్ధానంలో ఉంది. ఇతర రాష్ట్రాల ఆదాయంతో పోల్చితే తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత రెవెన్యూ వసూళ్లు అద్భుతంగా ఉన్నాయని ఆర్ధిక శాఖ వర్గాలు తెలిపాయి. తొలి దశలో వౌలిక సదుపాయాలను కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం ఇస్తోంది. 2015-16లో రూ. 76,133.83 కోట్ల రెవెన్యూ ఆదాయం, 2016-17లో రూ. 87,069.78 కోట్ల ఆదాయం వచ్చింది. 2017-18లో కచ్చితంగా రెవెన్యూ రూ.1.13 లక్షల కోట్లు దాటుతుందని ఆర్దిక శాఖాధికారి తెలిపారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో పన్నుల ద్వారా రూ. 79,624 కోట్లు, పనే్నతర రెవెన్యూ రూ. 6601.37 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూ. 26,857.67 కోట్లు కలిపి రూ.1.13 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనావేసింది.