తెలంగాణ

28వేల కోట్ల చేపలకు రూ. 24వేల కోట్ల వ్యయమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: మత్స్య కార్మికులకు పంపిణీ చేసేందుకు 28 వేల కోట్ల చేపలను, 24 వేల కోట్ల రూపాయలతో ఖరీదు చేస్తారా?, ఇదేమి విచిత్రం అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జి. చిన్నారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ మేరకు చేపలు ఖరీదు చేశారో లేదో తెలియదు కానీ డబ్బులు మాత్రం విడుదల చేశారని ఆయన విమర్శించారు. శనివారం అసెంబ్లీలో ఎక్సైజ్, ఆర్థిక, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖల పద్దులపై చిన్నారెడ్డి ప్రసంగిస్తూ మత్స్య కార్మికులకు చేప పిల్లలు ఇచ్చారో లేదోనని అన్నారు. సారా కాసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు కానీ కొంత మంది పోలీసులు మహిళలని కూడా చూడకుండా కొడుతున్నారని ఆయన తెలిపారు. సారా కాసే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. 84 లక్షల గొర్రె పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది కానీ గొర్రె పిల్లలు దొరికే పరిస్థితి లేదని అన్నారు. గొర్రె పిల్లల పంపిణీలో అవినీతి జరిగిందని ఆయన విమర్శించారు. ఈ దశలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, చిన్నారెడ్డి ప్రసంగానికి కొంత సేపు అడ్డుపడ్డారు. కందుల పంటలు వేసుకున్న రైతులకు కనీస మద్దతు ధర వచ్చేలా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తాము ఇటీవల రాజస్థాన్ మార్కెట్ యార్డును పరిశీలించామని, అక్కడ మార్కెట్ యార్డులు బాగా ఉన్నాయని అన్నారు. ఈ నెలాఖరున ఉగాది పండుగ రాబోతున్నదని, ప్రజలకు బక్షాలు చేసుకునేందుకు వీలుగా బెల్లం దొరికే పరిస్థితి లేదని ఆయన తెలిపారు.