తెలంగాణ

వారసత్వ ఉద్యోగాలపై రాజకీయం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: సింగరేణి వారసత్వ ఉద్యోగాల అంశం వివాదాస్పదం కావడం బాధాకరమని, వారసత్వ ఉద్యోగాల కల్పనలో రాజకీయం చేయొద్దని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 1981లోనే నాటి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) యాజమాన్యంతో వారసత్వ ఉద్యోగాలపై ఒప్పందం కుదుర్చుకుని అమలు చేస్తోందన్నారు. గత 20 ఏళ్లుగా అమలులో ఉన్న ఈ ఒప్పందాన్ని గత ప్రభుత్వాలు దీనిని రద్దు చేశాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత అమలుకు సిద్ధపడ్డారు. దీనిపై టిఆర్‌ఎస్ ప్రభుత్వం న్యాయపరంగా లోతుగా విశే్లషించకుండా తొందరపడి ఉత్తర్వులు ఇవ్వడంతో హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఆశావహులందరు అసంతృప్తికి గురై, ఆందోళన చెందుతున్నారన్నారు. హైకోర్టులో కూడా ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేదని, గతంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి)తో కుదుర్చుకున్న ఒప్పందాలను, అలాగే వారసత్వ ఉద్యోగాలు ఇవ్వబడిన ఉదంతాలను హైకోర్టుకు వివరించడంలో విఫలమయ్యారని చాడ ఆరోపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చొరవ తీసుకుని సీనియర్ అధికారులు, న్యాయనిపుణులతో కలసి పూర్వపరాలపై చర్చించి సరైన ప్రతిపాదనలతో సుప్రీం కోర్టుకు వెళ్లడం సబబుగా ఉంటుందని చాడ అభిప్రాయపడ్డారు. ప్రతి విషయాన్ని రాజకీయ కోణం నుంచి చూడడం తగదని, అందులో ప్రొఫెసర్ కోదండరాం మీద టిఆర్‌ఎస్ అనుబంధ సంఘం, ప్రభుత్వం అక్రోశం పెంచుకోవడం సమంజసం కాదన్నారు. ఇప్పటికే 24 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు సింగరేణిలో పనిచేస్తున్నారని వారసత్వ ఉద్యోగాలపై కోర్టు ఉత్తర్వుల పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్‌శాఖలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం సింగరేణి కాంట్రాక్టు ఉద్యోగుల గురించి ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదని వెంకటరెడ్డి ప్రశ్నించారు. లాభాల బాటలో ఉన్న సింగరేణిలో కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని చాడ డిమాండ్ చేశారు.