తెలంగాణ

ఆన్‌లైన్‌లోకి మిల్లర్ల లావాదేవీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: రైస్ మిల్లుల సామర్థ్యానికి అనుగుణంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం ధాన్యం అప్పగిస్తామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. రబీ ధాన్య సేకరణకు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం పౌర సరఫరాల భవన్‌లో రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ధాన్యం కేటాయింపులు, గోనె సంచులు వంటి సమస్యలపై చర్చించారు. 2015-16 రబీలో 1286 కొనుగోలు కేంద్రాల ద్వారా తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి కానుందని చెప్పారు. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్లు రైస్ మిల్లర్ల సంఘాలను సంప్రదించి మిల్లుల సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుని సిఎంఆర్ కేటాయిస్తారని తెలిపారు. 30 టన్నుల సామర్థ్యం ఉన్న మిల్లులకు 3000 టన్నుల ధాన్యం, 40 టన్నుల సామర్థ్యం ఉన్న వాటికి 4000 టన్నులు, 50 టన్నుల సామర్థ్యం ఉన్న వాటికి 5000 టన్నులు కేటాయించనున్నట్టు చెప్పారు. 60 టన్నుల కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న వాటికి ఎనిమిది వేల టన్నులు కేటాయించనున్నట్టు చెప్పారు. ఎనిమిది వేల టన్నులకు పైగా ధాన్యం తీసుకుంటే ఆ మిల్లులను మూడేళ్ల పాటు బ్లాక్‌లిస్టు చేయాలని సమావేశంలో రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై కమీషనర్ స్పందిస్తూ క్షేత్ర స్థాయిలో అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. ఖరీఫ్‌లో 99శాతం బియ్యం అప్పగింతపై కమీషనర్ సంతృప్తి వ్యక్తం చేస్తూ, మిల్లర్లలో చారా మార్పు వచ్చిందని, మరింత రావాలని అన్నారు. సంస్థకు సంబంధించిన గోనె సంచులు కూడా ఎప్పటికప్పుడు తిరిగి అప్పగించాలని చెప్పారు.
వీటి ఆలస్యం వల్ల సంస్థ కొత్తగా గోనె సంచులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయని చెప్పారు. దళారుల ప్రమేయాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు గత ఖరీఫ్ నుండి పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ధాన్యం లావాదేవీలు నిర్వహించినట్టు చెప్పారు. ఈ రబీ నుంచి రైస్ మిల్లర్లకు సంబంధించిన ధాన్యం కేటాయింపులు, దీనికి సంబంధించి మిల్లర్లు ప్రతి రైస్ మిల్లు దగ్గర విధిగా కంప్యూటర్‌ను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుందని చెప్పారు.