తెలంగాణ

నాయకులకు నైతిక విలువలు ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: రాజకీయ నాయకులు నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డి) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ 40వ వార్షికోత్సవ ముగింపు సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఉద్యోగుల్లో వృత్తి ప్రావీణ్యతతో పాటు నైతిక విలువలను పెంపొందించేందుకు శిక్షణ ఇస్తున్నారని గుర్తు చేశారు. పరిపాలన సజావుగా సాగేందుకు ఉద్యోగుల్లో నైతిక విలువలు పెంపొందించడమే కాకుండా, రాజకీయ నాయకుల్లో కూడా నైతిక విలువలు పెంపొందించాల్సి ఉందన్నారు. ఇందుకోసం అవసరమైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. లేనిపక్షంలో పరిపాలనలో దుష్ఫలితాలు వస్తాయన్నారు. ఇప్పటివరకు మానవ వనరుల అభివృద్ధికి శిక్షణ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌గా పేరుతెచ్చుకున్నదని, ఇక నుండి ‘సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్’ విభాగంతో ఎదగాల్సి ఉందన్నారు.
హెచ్‌ఆర్‌డి సంస్థ ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తుకు బాట వేసుకోవాలన్నారు. ఇప్పటికే రాష్టస్థ్రాయి సంస్థ నుండి జాతీయ స్థాయి సంస్థకు ఎదిగిందని, అంతర్జాతీయ సంస్థగా ఎదుగుతోందని, ఈ ఎదుగుదల పరిపుష్టి కావల్సి ఉందన్నారు. ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ‘పైలాన్’ను ఈటల ఆవిష్కరించారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ విభాగాన్ని ప్రారంభిస్తూ, లోగోను ఆవిష్కరించారు.
ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిని ప్రభుత్వ ఉద్యోగుల శిక్షణాకేంద్రం నుండి స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థగా, ఆ తర్వాత అప్టిట్యూడ్ డెవలప్‌మెంట్ సంస్థగా రూపొందించామని ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి మాజీ డైరెక్టర్ జనరల్ వికె అగర్వాల్ గుర్తు చేశారు. ఈ సంస్థను అంతర్జాతీయ సంస్థగా మారుస్తూ, రెండు అంతర్జాతీయ సంస్థలతో శిక్షణ కోసం గత ఏడాది ఒప్పందం కుదుర్చుకున్నామని గుర్తు చేశారు. ఈ సంస్థకు బంగారు భవిష్యత్తు ఉందని, మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్‌తో పాటు మరికొన్ని విభాగాలు ఏర్పడబోతున్నాయన్నారు.
హెచ్‌ఆర్‌డిని భవిష్యత్తులో ఉన్నతమైన సంస్థగా తీర్చిదిద్దుతామని ఈ సంస్థ డైరెక్టర్ జనరల్ బిపి ఆచార్య పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నత శిఖరాలకు చేరుకుంటోందని, హెచ్‌ఆర్‌డి ఇందుకు దోహదపడుతోందని ప్రభుత్వ సలహాదారు జిఆర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు ఎకె గోయల్, సంస్థ అడిషనల్ డిజి తిరుపతయ్య, తదితరులు మాట్లాడారు.

చిత్రం..ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డి 40వ వార్షికోత్సవ ముగింపు సమావేశంలో పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్