తెలంగాణ

సిఎంపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినా, అలాంటిది ఏమీ లేదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పేర్కొని సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని బిజెపి శాసనసభాపక్ష నాయకుడు జి కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చామని, కాపీని స్పీకర్‌కు అందజేశానని అన్నారు. ఈ నెల 15వ తేదీన శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా తాను తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఎన్‌సిడిసి ద్వారా కొంత రుణం, కొంత సబ్సిడీ అందుతోందని చెప్పానని, అయితే ముఖ్యమంత్రి సభలో మాట్లాడుతూ గొర్రెల పంపిణీలో ఏకాణ కూడా కేంద్రం ఇవ్వడం లేదని చెప్పారని గుర్తుచేశారు. పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ శాఖ రూపొందించిన బడ్జెట్ పుస్తకాల్లో మాత్రం ఎన్‌సిడిసి రుణం 3వేల కోట్లు, గ్రాంట్ 1000 కోట్లు ఉందని ఆర్థిక వివరాలు పేర్కొన్నారని అన్నారు. ముఖ్యమంత్రి సభలో ఇలా మాట్లాడటం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు.
24న చలో అసెంబ్లీ
రాజ్యాంగ విరుద్ధం, అనేక మార్లు న్యాయస్థానాలు వ్యతిరేకించినా ముస్లింలకు మతపరమైన 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా మార్చి 24న బిజెపి యువమోర్చ చలో అసెంబ్లీ నిర్వహిస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. యువ మోర్చ నిర్వహించిన సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు.