తెలంగాణ

400 ద్విచక్ర వాహనాలు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, మార్చి 18: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఆర్టీసీ బస్టాండ్ పార్కింగ్ స్థలంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ముఖ్యకూడలి ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శనివారం సాయంత్రం షాద్‌నగర్ ఆర్టీసీ బస్టాండ్‌లోని తుల్జ్భావాని, లక్ష్మీనర్సింహా బైక్ పార్కింగ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ ప్రాంతం ఆందోళనకరంగా మారిపొయింది. ముఖ్యకూడలిలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ పార్కింగ్‌లో ఒక్కసారిగా భారీ ఎత్తున మం టలు ఎగిసిపడుతుండటంతో ఆ ప్రాంత ప్రజలు భయకంపితులయ్యారు. ఎం జరుగుతుందోనని సమీప ప్రజలు, ప్రయాణికులు ఆర్టీసీ బస్టాండ్ నుండి పరుగులు తీశారు. క్షణాల్లో మంటలు భారీ స్థాయిలో వ్యాపించడంతో ఏమి చేయాలో తెలియక అటు ఆర్టీసీ అధికారులు ఇటు ప్రయాణికు లు పరుగులు పెట్టారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో భారీ ప్రమాదం జరగడంతో ఆర్టీసీ అధికారులు భయం గుప్పిట్లో ఉండిపోయా రు. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతం నుండి 30మీటర్ల దూరంలోనే ఆర్టీసీ డీజిల్ బంక్ ఉండటం.. భారీస్థాయిలో మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్న బస్సులను బయటకు తరలించారు. ఈ ప్రమాదంలో 400 ద్విచక్ర వాహనాలకు పైగా పూర్తిగా దగ్దమైపోయా యి. వీటి విలువ సుమారు కోటిన్నర వరకు ఉంటుందని అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఎగిసిపడుతున్న మంటల ను చూసి స్థానిక ప్రజలు వెంటనే ఫైరింజన్ అధికారులకు సమాచారం అందించారు. ఫైరింజన్ అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. వాహనాల పార్కింగ్ లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు వెల్డిం గ్ చేస్తుండగా నిప్పురవ్వలు పడి ప్రమాదం చోటు చేసుకుందని ప్రజలు తెలుపుతున్నారు.

చిత్రం..షాద్‌నగర్ ఆర్టీసీ బస్టాండ్ పార్కింగ్ స్థలంలో ఎగసిపడుతున్న మంటలు