తెలంగాణ

మధ్యంతరం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట/కేతేపల్లి, మార్చి 18: రాష్ట్రంలో 2019 వరకు టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన సాగదని, 2018లోనే కెసిఆర్ మధ్యంతర ఎన్నికలకు వెళ్లడం ఖాయమని టిటిడిపి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. శనివారం సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండల పరిధిలోని ఎర్కారం గ్రామంలో అమృత లింగేశ్వరస్వామి ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఉప్పలపహాడ్ గ్రామ స్టేజీ వద్ద నూతనంగా నిర్మిస్తున్న శ్రీ బంగారు మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రెండుచోట్ల ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌కు ఇదే చివరి బడ్జెట్ అని, వచ్చే సంవత్సరం రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ప్రజలకు అమలు చేయలేని హామీలను ఇచ్చిన కెసిఆర్ గడువు ముగియక ముందే మధ్యంతర ఎన్నికలకు వెళ్తారన్నారు. ఇదిలావుండగా సిఎల్పీ నేత జానారెడ్డి చెప్పిన ప్రకారం కాంగ్రెస్ పార్టీ బహుబలి హరీశ్ రావు కావచ్చేమోనని ఆయన వ్యాఖ్యనించారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టే ముందు తెలంగాణ సమస్యలపై అవగాహన కల్పించుకొని ఆ తర్వాత పార్టీ పెడితే మంచిదన్నారు.

చిత్రం..నల్లగొండ జిల్లా ఉప్పలహాడ్‌లో బంగారు మైసమ్మ దేవాలయంలో పూజలు చేసిన రేవంత్‌రెడ్డి