తెలంగాణ

ఫసల్ బీమా అంటే తెలుసా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీపేట, మార్చి 18: రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకంపై బిజెపి శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి అవగాహన లేక మాట్లాడుతున్నారని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఫసల్ బీమా పథకంలో రాష్ట్ర వాటాను చెల్లించడం జరిగిందని, కానీ, కేంద్రం మండలం, నియోజకవర్గం యూనిట్‌గా నిర్ణయించడం వల్ల నవీపేట మండలంలో పంటలు నష్టపోయిన 10గ్రామాల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయిందని అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నందిగాం గ్రామ శివార్లలో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను ఎంపి కవిత పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఎంపి కవిత సమాధానం ఇస్తూ, ఫసల్ బీమా పథకం లోపభూయిష్టంగా ఉందని తాము మొదటి నుండి చెబుతున్నామని, మం డలం, నియోజకవర్గం యూనిట్‌గా ఉంటే, రైతులకు నష్టపరిహారం ఎలా అందుతుందన్నారు. ఈ లోపభూయిష్టమైన పథకం వల్ల నవీపేట మండలంలోని 10గ్రామాల్లో పెద్దమొత్తంలో పంట నష్టం జరిగినా, మండలం యూనిట్ కారణంగా రైతులకు నష్టపరిహారం వచ్చే అవకాశం లేకుండాపోయిందన్నారు. దీంతో ఫసల్ బీమా పథకంలో పస లేకుండాపోయిందన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందిం చి, గ్రామం యూనిట్‌గా తీసుకుని ఇన్సూరెన్స్ చేయిస్తే, పంటలు నష్టపోయిన రైతులకు లాభం చేకూరే అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయమై బిజెపి శాసన సభాపక్ష నేత కిషన్‌రెడ్డి తెలియక మాట్లాడుతుండటం విచారకరమన్నారు.