తెలంగాణ

కనె్నర్ర చేసిన ప్రకృతి... ఆదుకోని ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, మార్చి 18: ప్రకృతి విలయాల వల్ల రైతన్నలకు జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వాలు ఆదుకోవడం లేదన్న బాధ రైతుల్లోంచి వస్తుందనడానికి శుక్రవారం కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండలంలోని రైతులు చలో హైదరాబాద్ పాదయాత్రను చెప్పవచ్చు. గురువారం రాత్రి కురిసిన అకాల వడగళ్ల వర్షం రైతుల జీవితాలను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా జిల్లాలోని బాన్స్‌వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి డివిజన్‌లలో రైతన్నలకు కంట తడిపెట్టించింది. బాన్స్‌వాడ డివిజన్‌లోని బీర్కూర్, బాన్స్‌వాడ, పిట్లం, బిచ్కుంద మండలాల్లో రైతుల వరి మొక్కజొన్న, జొన్న, మామిడి పంటలకు అపరాలకు నష్టాన్ని కలిగించింది. జిల్లాలో దాదాపు 9 కోట్లపై చిలుకు వరి, మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు పంటలతో పాటు మామిడి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ, రెవెన్యూ శాఖల ప్రాథమిక అంచనాలను బట్టి ఖరారు చేశారు. ఇందులో ఎక్కువ భాగం బీర్కూర్, బాన్స్‌వాడ, బిచ్కుంద మండలంలో నష్టం జరిగినట్లు సమాచారం. నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లో ఈసారి సమృద్ధిగా నీరు ఉండడంతో రైతులు రబీలో పంటలు పండించుకుని చేసుకున్న అప్పులు తీర్చుకోవచ్చన్న ఆశతో మరింత అప్పు చేసి ఈసారి రబీలో బాన్స్‌వాడ డివిజన్‌లోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు పరిధిలోని రైతులు చాలామంది వరి పంటను వేసుకున్నారు. వరి పంట కొంత పొట్టదశ మొదలు కావడంతో ఇదే సమయంలో ప్రకృతి విలయం ఒక్కసారిగా రైతన్నల ఆశలపై నీరు పోసింది. దీంతో కడుపు మండిన బాన్స్‌వాడ మండలంలోని తాడ్కోల్ రైతులు, బీర్కూర్ మండలంలో రైతులు, బిచ్కుంద మండలంలోని వాజీద్‌నగర్ రైతులు రాస్తారోకోలు చేపట్టడం గమనార్హం. ఈ రాస్తారోకోలతో ట్రాఫిక్ స్తంభించిపోయిన పోలీసులు సైతం ఏం చేయలేని నిస్సహాయస్థితిలో చివరకు రెవెన్యూ, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారుల హామీల మేరకు రైతులు కొంతమేరకు శాంతించారు. జిల్లాలోని బీర్కూర్ మండలం బీర్కూర్, కిష్టాపూర్, చించొల్లి, దామరంచ, అన్నారం, గ్రామాల నుండి రైతులు పలు డిమాండ్‌లతో స్వచ్ఛందంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పంటనష్టపోయిన రైతులకు ఎకరానికి 50 వేల రూపాయలు చెల్లించాలని, నష్టపోయిన పంట ను అంచనా వేసేందుకు రాష్ట్ర స్థాయి నుండి ఒక కమిటీని పంపించాలని, రైతులు, కౌలు రైతుల బాధలపై అసెంబ్లీలో చర్చించి రైతులకు న్యాయం చేయాలని, బ్యాంకు రుణాలు వెంటనే మాఫీ చేయాలని, రైతులు తీసుకున్న రుణాలు వెంటనే పూర్తిగా మాఫి ప్రకటించాలన్న డిమాండ్‌లతో పాటు భారీ వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలకు సంబంధించిన పూర్తి వివరాలు సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకునిపోతే కనీసం తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో తాము పాదయాత్ర చేపట్టినట్లు ఆ ప్రాంత రైతు నాయకులు ప్రకటించారు. అందుకే తాము ఈ పాదయాత్ర హైదరాబాద్ వరకు చేపట్టినట్లు వెల్లడిస్తున్నారు.

చిత్రం..కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండలంలో రాస్తారోకో చేస్తున్న రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్ సత్యనారాయణ