తెలంగాణ

తెలంగాణ జాగృతికి కొత్త కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19:తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడానికి ఏర్పాటు చేసిన తెలంగాణ జాగృతి నూతన కార్యవర్గాన్ని అధ్యక్షురాలు, ఎంపి కవిత ప్రకటించారు. వ్యవస్థాపక అధ్యక్షురాలిగా కవిత వ్యవహరిస్తారు. ప్రధాన కార్యదర్శిగా రంగు నవీన్ ఆచారి, ఉపాధ్యక్షులుగా రాజీవ్ సాగర్, ఆయాచితం శ్రీ్ధర్, మంచాల వరలక్ష్మి, విజయభాస్కర్, జి మోహన్‌రెడ్డిలను నియమించారు. అధికార ప్రతినిధిగా దొనికెన కుమార స్వామి, కోశాధికారి, పిఆర్‌ఓ కె సంతోష్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శులుగా టి తిరుపతిరావు, జవహర్, చెన్నయ్య, వేణుగోపాల స్వామి, నలమాస శ్రీకాం త్ గౌడ్, విజయేందర్, డి వెంకట రమణ, అనంతరావు, విక్రాంత్‌రెడ్డి, బిక్షపతి స్వామి, కృష్ణాగౌడ్, నరాల సుధాకర్,, నంది శ్రీనివాస్, రజిత కుసుమ, సురేశ్ కండం, శ్రీనివాసులు, రోహిత్‌రావు సిరిసినగండ్ల నియమితులయ్యారు. అనుబంధ విభాగాల కన్వీనర్లుగా చెన్నమనేని ప్రభావతి, విజయ్, చరణ్, కంచనపల్లి, డాక్టర్ ప్రీతిరెడ్డి, కోదారి శ్రీను, శ్రీనివాస్, అంజన్‌రెడ్డి, తిరుపతి వర్మ, కెఎల్‌ఎన్‌రావులను నియమించారు. ఏడుగురు కో కన్వీనర్‌లను, 31 మంది జిల్లా కన్వీనర్‌లను నియమించారు.