తెలంగాణ

లీజుకు ఔటర్ రింగ్ రోడ్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పర్యవేక్షణ బాధ్యతలను లీజుపై ప్రైవేట్ ఏజన్సీలకు ఇవ్వాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవప్‌మంట్ అథారిటీ యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనల ఫైలును మున్సిపల్ శాఖకు హెచ్‌ఎండిఏ పంపింది. 20 నుంచి 25 సంవత్సరాల పాటు లీజుపై ప్రైవేట్ ఏజన్సీకి అప్పగిస్తే రూ. 2వేల కోట్ల వరకు ఆదాయం రావచ్చని హెచ్‌ఎండిఏ అంచనా వేసింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే బిడ్స్‌ను ఆహ్వానించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ఆపరేషన్, మెయింటెనెన్స్ నిమిత్తం ప్రైవేట్ ఏజన్సీలకు అప్పగిస్తే చాలా సంస్ధలు పోటీపడనున్నాయి. ప్రస్తుతం హెచ్‌ఎండిఏ సాలీనా రూ. 70 కోట్లను ఔటర్ రింగ్ రోడ్డు పర్యవేక్షణ నిమిత్తం ఖర్చుపెడుతోంది. దీని వల్ల రూ. 190కోట్ల ఆదాయం వస్తోంది. జాతీయ రహదాల నిర్వహణ బాధ్యతను కేంద్రం పలు చోట్ల ప్రైవేట్ ఏజన్సీలకు అప్పగించింది. దేశంలో ఇప్పటికే 75 జాతీయ రహదారుల నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ ఏజన్సీలకు కేంద్రం అప్పగించింది.