తెలంగాణ

బియ్యం సబ్సిడీకి 2,600 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: తెలంగాణ ప్రభుత్వం రూపాయికే కిలోబియ్యం సబ్సిడీపై ఇచ్చేందుకు 2017-18 లో 2,600 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖకు కొత్త బడ్జెట్‌లో 2835 కోట్ల రూపాయలు కేటాయించగా, ఇందులో దాదాపు 92 శాతం నిధులు బియ్యం పథకానికే వినియోగిస్తున్నారు. కేంద్ర జాతీయ ఆహార భద్రతా పథకం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద 1.08 లక్షల టన్నుల బియ్యం ఇస్తోంది. ఒక్కో వ్యక్తికి ఐదు కిలోల చొప్పున 192 లక్షల లబ్దిదారులకు కేంద్రం బియ్యం ఇస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 274 లక్షల మందికి సబ్సిడీపై బియ్యం ఇస్తోంది. జాతీయ ఆహార భద్రతా పథకం కిందకు రాని వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ఇవ్వడం గమనార్హం. కేంద్రం ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ పథకం కింద ఇచ్చే బియ్యాన్ని కిలోకు మూడు రూపాయలకే ఇస్తున్నప్పటికీ, మరో కోటి మందికి అవసరమైన బియ్యాన్ని కిలో 25.20 రూపాయల చొప్పున రాష్ట్రం కొనుగోలు చేసి కిలో రూపాయికే సబ్సిడీపై ఇస్తోంది. ఈ కారణంగానే సబ్సిడీ బియ్యానికి సంవత్సరానికి రాష్ట్రం 2600 కోట్ల రూపాయలు భరించాల్సి వస్తోంది. బియ్యానికి సంబంధించి పంపిణీ జరుగుతున్న వివరాలు ఇలా ఉన్నాయి. పేదరికం దిగువన ఉన్న కుటుంబాలకు ఆహార భద్రతా కార్డుల ద్వారా 79.97లక్షల కుటుంబాలకు కిలో ఒక రూపాయికే బియ్యం ఇస్తున్నారు. ఒక్కొక్కరికి నెలకు ఆరుకిలోల చొప్పున కుటుంబ సభ్యులు ఎంత మంది ఉన్నా అందరికీ ఇస్తున్నారు. నిరుపేదలకు, ఎస్‌టిలకు, వితంతువులు తదితరులకు అంత్యోదయ అన్నపూర్ణ పథకం కింద 5.54 లక్షల మందికి కిలో ఒక రూపాయికి కార్డుపై 35 కిలోల బియ్యం ఇస్తున్నారు.