తెలంగాణ

రాష్ట్రంలో వ్యవసాయ కూలీలే ఎక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19:దేశంలో అత్యధికంగా నగరం, పట్టణ ప్రాంతాల్లో నివసించేది తెలంగాణలోనే. దాదాపు 40 శాతం మంది నగరం, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అయినా దేశ సగటు కన్నా ఎక్కువ శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కూలీలు తెలంగాణలో ఉన్నారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారమే దేశంలో వ్యవసాయ కూలీలు 54.6శాతం మంది కాగా, తెలంగాణలో 55.7శాతం మంది ఉన్నారు. తెలంగాణలో భౌగోళిక విస్తీర్ణం 112.04 లక్షల హెక్టార్లు కాగా, సాగు విస్తీర్ణం 53.15 లక్షల హెక్టార్లు. రాష్ట్రంలోని సగం వ్యవసాయ భూమి సాగుకు అవకాశం లేకుండా ఉంది. మత్స్య సాగుతో కలిపి నికర సాగు విస్తీర్ణం 43.77లక్షల హెక్టార్లు. కేవలం 9.38 లక్షల హెక్టార్లలో మాత్రమే ఒకసారి కన్నా ఎక్కువ సార్లు విత్తన విస్తీర్ణం కల వ్యవసాయ భూములు ఉన్నాయి. మిగిలిన 34లక్షల హెక్టార్లలో ఒకేసారి సాగు అవుతుంది. తెలంగాణలో కమతాల సంఖ్య 55.54లక్షలు. సగటున ఒక్కో రైతుకు 1.2 హెక్టార్ల కమతాలు ఉన్నాయి. 17.26లక్షల హెక్టార్లు నీటిపారుదల కింద సాగు అవుతోంది. రాష్ట్రంలో వర్షాధారం కిందే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తున్నారు. 55.49 శాతం మంది రాష్ట్ర ప్రజలు వ్యవసాయం, అనుబంధ వృత్తులపైనే ఆధారపడుతున్నారు.
తెలంగాణలో విత్తనోత్పత్తికి అత్యంత అనుకూలమైన వాతావరణం ఉండడంతో ఇటీవల ప్రభుత్వం దీనిపై దృష్టిసారించింది. తెలంగాణను విత్తన భాండాగారంగా మార్చే ప్రయత్నాలు చేస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా హైబ్రిడ్ పత్తి ఉత్పత్తికి, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలు మొక్కజొన్న విత్తన ఉత్పత్తికి, కరీంనగర్, వరంగల్ జిల్లాలు హైబ్రిడ్ వరి విత్తన ఉత్పత్తికి అనుకూలంగా ఉండడంతో ఆయా జిల్లాల్లో విత్తనాల ఉత్పత్తికి ప్రోత్సహిస్తున్నారు. నాణ్యమైన విత్తన ఉత్పత్తి కోసం వ్యవసాయ పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లు, ఏజెన్సీలు, ప్రైవేటు విత్తన ఉత్పత్తి సంస్థల సమన్వయంతో ఒక దీర్ఘకాలిక విత్తన ఉత్పత్తి ప్రణాళిక రూపొందించనున్నారు. వరి, జొన్న, కంది, పెసర, మినుము, శనగ, వేరుశనగ, ఆముదం, నువ్వులు తదితర విసత్తనాల ఉత్పత్తి కోసం ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించింది. భారీ నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో వ్యవసాయ రంగం రూపురేఖలు పూర్తిగా మారిపోన్నాయి.